ETV Bharat / sukhibhava

బీరకాయతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో.. డయాబెటిస్, మలబద్ధకం, అధిక బరువుకు చెక్​!

Ridge gourd Healh Benefits : అధిక బరువుతో బాధపడే చాలామందికి బరువును ఎలా తగ్గించుకోవాలో తెలియక సతమతమవుతుంటారు. అలాంటి వారికి బీరకాయ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కూరగాయల్లో ఒక రకమైన బీరకాయ వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

benefits-of-ridge-gourd-and-benefits-of-ridge-gourd-for-weight-loss
బీరకాయ వల్ల అరోగ్య ప్రయోజనాలు
author img

By

Published : May 8, 2023, 1:27 PM IST

Updated : May 8, 2023, 2:06 PM IST

Ridge gourd Healh Benefits : మనం రోజూ తినే కూరగాయాల్లో శరీరానికి మేలు చేసే ఎన్నో పోషక విలువలు ఉంటాయి. ప్రతీ కూరగాయలోనూ శరీరానికి శక్తిని అందించే పదార్థాలు ఉంటాయి. ఈ పదార్థాలు మనిషి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దాంతో పాటు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసే పదార్థాలు కూరగాయల్లో ఉంటాయి. అలాంటి కూరగాయల్లో బీరకాయ కూడా ఒకటని చెప్పవచ్చు. బీరకాయలతో చేసే పదార్ధాలు తీసుకోవడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి.

బీరకాయలో తక్కువ కేలరీలతో పాటు ఎక్కువ ఫైబర్ ఉంటుంది. అంతేకాకుండా ఇందులో యాంటీఆక్సిడెంట్లతో పాటు విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. బీరకాయ జీర్ణక్రియను మరింత మెరుగుపరుచుతోంది. అదేవిధంగా రోగనిరోధక శక్తిని పెంచడంలో బీరకాయ ఎంతో ఉపయోగపడుతుంది. బీరకాయ తీసుకోవడం వల్ల కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అధిక బరువుకు చెక్..
Benefits of ridge gourd for Weight loss : చాలామంది అధిక బరువుతో బాధపడుతుంటారు. బరువు తగ్గడం కోసం ఉదయం, సాయంత్రం జిమ్‌లకు వెళ్లి శ్రమిస్తుంటారు. అలాంటి వారికి బీరకాయ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే బరువును తగ్గించడంలో బీరకాయ సహాయపడుతుందట. ఆకలిని తగ్గించడమే కాకుండా అతిగా తినడాన్ని నివారిస్తుందట. శరీరంలోని అదనపు నీటిని కూడా తొలగించడం వల్ల.. శరీర బరువు వెంటనే తగ్గే ఉవకాశం ఉంది. అధిక బరువుతో బాధపడేవారు తరచూ బీరకాయ తీసుకోవడం వల్ల కొంతమేరకు లాభం ఉంటుంది.

డయాబెటిస్ రోగులకు మంచి ఔషధం..
Ridge gourd Benefits for Diabetes : డయాబెటిస్ రోగులకు రక్తంలోని షుగర్ స్థాయిలను నియంత్రించడంలో బీరకాయ ఎంతో మేలు చేస్తుంది. బీరకాయలో చరంటిన్ అనే పదార్ధం ఉంటుంది. ఇది రక్తంలోని షుగర్ స్ధాయిలు అదుపులో ఉండేలా చేస్తుంది. అలాగే బీరకాయలో ఉండే పీచు పదార్ధం రక్తంలోని షుగర్ లెవల్స్ ఆకస్మికంగా పెరగడాన్ని నివారిస్తుంది. దీంతో డయాబెటిస్ రోగులకు బీరకాయ మంచి ఔషధంగా పనిచేస్తుందని చెప్పవచ్చు.

రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది..
Ridge gourd Benefits for Immunity : కరోనా తర్వాత రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం కోసం అందరు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రోగ నిరోధక శక్తిని పటిష్టం చేయడానికి బీరకాయ చాలా ఉపయోగపడుతుంది. ఈ కూరగాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే బీరకాయలో జింక్, ఐరన్, పొటాషియం విటమిన్లతో పాటు ఎన్నో ఖనిజాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను మరింత మెరుగుపరుస్తాయి.

మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం..
Ridge gourd Benefits for Constipation : మలబద్ధకం సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. అలాంటివారికి బీరకాయ ఎంతో మేలు చేస్తుంది. బీరకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపర్చడం, మలబద్దకాన్ని తగ్గిస్తోంది. ప్రేగు కదలికలను నియంత్రించడంలో, జీర్ణ సమస్యలను నివారించడంలో ఎంతో ఉపయోగపడుతుంది.

ఆరోగ్యవంతమైన చర్మం..
Ridge gourd Benefits for Skin: అలాగే చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం, వృద్ధాప్యాన్ని నివారించడంలో బీరకాయ చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, కెరిటన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. ఇక ఇందులో ఉండే సిలికా అనే ఖనిజం చర్మం, జుట్టు, గోళ్లు ఆరోగ్యవంతంగా ఉండేందుకు సహాయపడతాయి. బీరకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మ సౌదర్యం పెరుగుతుంది.

Last Updated : May 8, 2023, 2:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.