కలిసిమెలిసి..
ఉదయం పూట వాకింగ్‌కు వెళ్లాలనుకుని రాత్రి నిర్ణయించుకున్నా... తెల్లారేసరికి ఇద్దరిలో ఎవరో ఒకరు అంతగా ఆసక్తి చూపించరు. అలాంటప్పుడు జంటలో మరొకరు భాగస్వామికి కాస్త ఉత్సాహాన్ని అందించాలి. ‘సరదాగా ఇద్దరం కలిసి వెళ్లి గంటలో తిరిగొచ్చేద్దాం’ అని ఒప్పించాలి. దాంతో రెండోవాళ్లు మొదట్లో ఆసక్తి చూపించకపోయినా మెల్లగా వ్యాయామానికి అలవాటుపడతారు. దీంతో ఇద్దరి ఆరోగ్యమూ బాగుంటుంది.
లక్ష్యం పెట్టుకోవాలి..
దంపతులిద్దరూ వ్యాయామం తప్పనిసరనే లక్ష్యాన్ని పెట్టుకోవాలి. తమ కోసం గంటసేపు వర్కవుట్ పేరుతో ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇద్దరికీ ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే ఎవరెంత త్వరగా అడుగులేస్తారనే విషయంలో చిన్నచిన్న పోటీలూ పెట్టుకోవాలి. ఇవి ఇద్దరిలోనూ మరింత ఉత్సాహాన్ని పెంచుతాయి. ఉదయం లేదా సాయంత్రం ఇలా ఒకరినొకరు ఉత్సాహపరుచుకుంటూ చేసే వ్యాయామాలు ఆరోగ్యాన్నే కాదు.. మానసికానందాన్నీ అందిస్తాయి.
బంధం బలపడేలా..
దంపతులు పనులతో ఎంత బిజీగా ఉన్నా కొంత సమయాన్ని పరుగు, నడక లాంటి వాటికి కేటాయించుకుని చూడండి. కాసేపు మాట్లాడుకుంటూ వ్యాయామం చేయడం వల్ల బంధం మరింత బలపడుతుంది. వర్కవుట్లు చేస్తే ఆరోగ్యంతోపాటు ఇద్దరి మధ్య అనుబంధమూ మరింత పెరుగుతుంది.
- ఇదీ చూడండి: వ్యాయామం ఆపొద్దు.. అయితే అతి వద్దు