ETV Bharat / sukhibhava

రోజుకో నారికేళం- అందం, ఆరోగ్యం పదిలం!

author img

By

Published : Sep 4, 2020, 10:31 AM IST

ఎలాంటి ఆరోగ్య సమస్యలెదురైనా సరే.. కొబ్బరి నీళ్లు తాగితే చాలు.. సమస్య నుంచి సగం విముక్తి పొందినట్లే.. మరి అంతటి ఔషధ గుణాలున్న కొబ్బరి నీళ్లతో ఆరోగ్యానికే కాదు, అందానికీ ఎన్నో లాభాలున్నాయి. అవేంటో చూసేద్దాం రండి..

Beauty and health benefits of coconut water in Telugu
రోజుకో ఓ నారికేళం - అందం, ఆరోగ్యం పదిలం!

'తక్కువ క్యాలరీలు.. నాలుగు అరటిపండ్లలో ఉండే పొటాషియం కంటే ఎక్కువ పొటాషియం.. కొలెస్ట్రాల్ ఫ్రీ.. సహజసిద్ధమైన కొవ్వులు..' ఇదే కొబ్బరి నీళ్ల ఫార్ములా. ఇందులో చక్కెర, ఎలక్ట్రోలైట్‌ల రూపంలో ఉండే కార్బోహైడ్రేట్ వల్ల మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అలాగే చర్మాన్ని పునరుత్తేజితం చేయడంలో కీలకపాత్ర వహిస్తుంది. పైగా అందరూ ఇష్టపడి తాగే న్యాచురల్ డ్రింక్ కూడా. అంతేనా......

Beauty and health benefits of coconut water in Telugu
కొబ్బరి నీళ్లు పవిత్రం

అందానికి..

  • మొటిమల నివారణకు, యవ్వనంగా కనిపించడానికి కొబ్బరి నీళ్లు చాలా ఉపయోగపడతాయి. అదెలాగంటే కొబ్బరినీళ్లను ముఖంపై నేరుగా అప్త్లె చేసుకోవాలి. ఇలా ఒక రాత్రంతా ఉంచుకోవాలి. అలాగే చేతులకు, గోళ్లకు రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
  • కొబ్బరి నీళ్లు శరీరానికి మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తాయి.
  • నిర్జీవమైన చర్మానికి కొబ్బరి నీళ్ల వల్ల మెరుపు వస్తుంది.
  • శరీరంలోని ప్రతి కణానికి సరైన మోతాదులో ఆక్సిజన్ అవసరం. సరైన రక్తప్రసరణ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. అలాగే చర్మం ఆరోగ్యంగా, నవయవ్వనంగా కనిపించేలా చేసే గుణం కొబ్బరి నీళ్లకుంది.

  • ముల్తానీ మట్టిలో కొబ్బరి నీళ్లు కలుపుకుని రోజూ శరీరానికి రాసుకోవాలి. ఇది సహజసిద్ధమైన స్క్రబ్‌లా పనిచేస్తుంది. ఇలా చేయడం వల్ల చర్మంపై ట్యాన్ తొలగిపోయి.. మెరుపును సంతరించుకుంటుంది.

  • వేసవి కాలంలో చాలామందికి ఎదురయ్యే సమస్య.. చెమట వల్ల చర్మంపై ఏర్పడే ఇన్‌ఫెక్షన్.. కొబ్బరి నీళ్లలో ఉండే యాంటీ వైరల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగజేస్తాయి. కొబ్బరి నీళ్లను స్నానం చేసే నీటిలో కూడా కలుపుకోవచ్చు.
  • సాధారణంగా వేసవిలో చాలామంది చర్మం జిడ్డుగా తయారవుతుంది. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల చర్మం జిడ్డుదనాన్ని కోల్పోయి తాజాగా మారుతుంది.
  • స్నానానికి ముందు కొబ్బరి నీళ్లతో తలకు మసాజ్ చేసుకుంటే జుట్టు మృదువుగా, సిల్కీగా అవుతుంది. అంతేకాదు ఇది జుట్టుకు మంచి కండిషనర్‌గా కూడా పనిచేస్తుంది.
  • చుండ్రు సమస్యను తగ్గించి.. జుట్టు బలంగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.

ఆరోగ్యానికి..

  • కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రక్తప్రసరణ వ్యవస్థ అదుపులో ఉంటుంది. దీనివల్ల గుండెనొప్పి, ఇతర గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అంతేకాదు.. ఇది శరీరంలోని చక్కెర స్థాయుల్ని కూడా అదుపులో ఉంచుతుంది.
  • అధిక బరువుతో సతమతమవుతున్నారా? అయితే కొబ్బరి నీళ్లను మీ ఆహారంలో భాగం చేసుకోండి. ఎందుకంటే దీనిలో తక్కువ మొత్తంలో కొవ్వులు ఉండటం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చు.
  • కొబ్బరి నీళ్లలో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరిగి.. ఎలాంటి వైరల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా మన శరీరాన్ని కాపాడుతుంది. అలాగే కొబ్బరి నీళ్లలో న్యూట్రియంట్లు; రైబోఫ్లేవిన్, థయమిన్, నియాసిన్, పైరిడాక్సిన్ విటమిన్లు, ఫోలేట్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి.
  • చాలామందికి ప్రెగ్నెన్సీ సమయంలో ఆహారం త్వరగా జీర్ణం కాకపోవడం, మలబద్ధకం మొదలైన సమస్యలు ఎదురవుతాయి. వీటిని తగ్గించుకోవాలంటే కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. అలాగే కొబ్బరి నీళ్లలో క్యాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు, కండరాలు దృఢంగా తయారవుతాయి.

ఎంతో ఆరోగ్యం
  • మూత్రపిండాల సంబధిత సమస్యతో బాధపడే వారికి కొబ్బరి నీళ్లు మంచి ఔషధం. ఎందుకంటే దీనిలో ఉండే పొటాషియం, మినరల్స్, మెగ్నీషియం వల్ల ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి.
  • కొబ్బరి నీళ్లలో అధిక మొత్తంలో ఉండే పోషకాల వల్ల శరీరానికి అధిక శక్తి అందుతుంది. తక్కువ మొత్తంలో ఉండే సోడియం, చక్కెర, ఎక్కువ మొత్తంలో ఉండే క్లోరైడ్, క్యాల్షియం, పొటాషియం వల్ల శరీరం హైడ్రేట్ అవడమే కాకుండా పునరుత్తేజితం చెందుతుంది. కండరాల తిమ్మిరి సమస్యతో బాధపడే వారు కొబ్బరి నీళ్లు తాగితే ఆ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. దీనికి కారణం.. కొబ్బరి నీళ్లలో అధిక మొత్తంలో ఉండే పొటాషియం.
  • కొబ్బరి నీళ్లు తాగడం వల్ల డయాబెటిస్ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు. రోజూ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. శరీరంలోని రక్తనాళాలు వెడల్పై రక్తం సులభంగా ప్రసరిస్తుంది. అలాగే కొబ్బరి నీళ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కాళ్లు, చేతుల వాపును తగ్గిస్తాయి.

కనుక.. తెలిసిందిగా.. అందానికి, ఆరోగ్యానికీ కావలసిన ఔషధ గుణాలున్న కొబ్బరి నీళ్ల గురించి.. ఇంకెందుకాలస్యం కొబ్బరి నీళ్లు తాగి అందాన్ని, ఆరోగ్యాన్నీ మీ సొంతం చేసుకోండి.

ఇదీ చదవండి: కొబ్బరి తింటే బోలెడన్ని లాభాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.