ETV Bharat / sukhibhava

డైలీ ఈ పొరపాట్లు చేస్తున్నారా? - అయితే మీ చర్మం దెబ్బతినడం ఖాయం! - Avoid These SkinCare Mistakes

Skin Care Mistakes : మన బాడీని అనుక్షణం ప్రతికూల పరిస్థితుల నుంచి కాపాడే అద్భుతమైన రక్షణ కవచం.. చర్మం. అలాగే మనం అందంగా కనిపించడానికి చర్మ సంరక్షణ చాలా అవసరం. కానీ, డైలీ మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల కారణంగా చర్మం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. మరి, ఆ పొరపాట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..

Skin Care Mistakes
Skin Care Mistakes
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 17, 2024, 12:24 PM IST

Skin Care Common Mistakes : ప్రతి ఒక్కరూ చర్మం కాంతివంతంగా నిగనిగలాడుతూ.. ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా మహిళలు తమ చర్మ సౌందర్యం కోసం ఏవేవో టిప్స్ పాటిస్తూ ఉంటారు. అయినా కొన్నిసార్లు చర్మం జిడ్డుగా, కాంతిహీనంగా తయారవుతుంది. ఇందుకు కారణం.. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వాతావరణం మార్పులు. అయితే చర్మం డ్యామేజ్​ కావడానికి.. ఇవి మాత్రమే కారణం కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. చర్మాన్ని(Skin) జాగ్రత్తగా ఉంచుకోవాలనే క్రమంలో డైలీ తెలిసో తెలియకో మనం చేసే కొన్ని పొరపాట్లు కూడా కారణమని చెబుతున్నారు. అందుకే ఆ తప్పులు చేయకుండా ఉన్నారంటే మీ చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా మెరుస్తుందంటున్నారు. ఇంతకీ ఆ మిస్టేక్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

సరిగ్గా ఫేస్ వాష్ చేసుకోకపోవడం : చాలా మంది ఫేస్​కి వేసుకున్న మేకప్​ను తొలగించుకోవడంలో అశ్రద్ధ వహిస్తారు. ఇక కొందరు పైపైన ఫేస్​వాష్​ చేసుకుంటారు. మేకప్​ను తొలగించుకోవడానికి సరైన క్లెన్సర్​ని యూజ్ చేయరు. కాబట్టి.. మీరు ఎప్పుడైతే.. సరైన క్లెన్సర్ యూజ్ చేసి క్లీన్ చేసుకుంటారో.. అప్పుడే మీ చర్మ రంధ్రాలు మూసుకుపోవు. అప్పుడు చర్మం దెబ్బతినకుండా ఉంటుంది.

ఓవర్ ఎక్స్‌ఫోలియేటింగ్ : చర్మం దెబ్బతినడానికి మీరు చేసే మరో తప్పు ఓవర్ ఎక్స్​ఫోలియేటింగ్. సాధారణంగా ఎక్స్​ఫోలియేట్ చేయడం ద్వారా చనిపోయిన చర్మకణాలను తొలగించుకోవచ్చు. కానీ, ఎక్కువగా ఎక్స్‌ఫోలియేట్ చేయడం వల్ల మీ చర్మం సహజ నూనెలు పోయి చర్మానికి మేలు కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. కాబట్టి మీ చర్మ రకానికి అనుగుణంగా వారానికి రెండు నుంచి మూడుసార్లు ఎక్స్‌ఫోలియేట్ చేయండి.

మేకప్‌తో నిద్రపోవడం : చాలా మంది చేసే మరో పొరపాటు.. పార్టీలు, ఫంక్షన్​లకు వెళ్లి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యే ఓపిక లేక​ మేకప్​తోనే నిద్రపోతారు. కానీ అది చర్మానికి నష్టం కలిగించే అతి పెద్ద పొరపాటు. మేకప్​తో పడుకోవడం ద్వారా మీ చర్మ రంధ్రాలు, నూనె గ్రంథులు మూసుకుపోతాయి. దాంతో చర్మ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు ఈ అలవాటును మార్చుకోవాలి.

సరైన క్రమంలో ప్రొడక్ట్స్ అప్లై చేయకపోవడం : ఈ రోజుల్లో మెజార్టీ జనాలు ఫేస్ క్రీమ్స్ వాడుతున్నారు. అయితే చాలా మంది ఏదో ఆదరా బాదరాగా అలా ఆ ప్రొడక్ట్స్ చర్మానికి పూసేస్తుంటారు. ఇది కూడా చర్మానికి హాని కలిగిస్తుంది.

మురికిగా మారిన మేకప్ బ్రష్‌లు వాడడం : కొంతమంది చాలా రోజులుగా ఒకే మేకప్ బ్రష్ వాడుతుంటారు. దాంతో అది మొత్తం మురికిగా మారుతుంది. అయితే డర్టీ మేకప్ బ్రష్‌లు కూడా మీ చర్మానికి మీరు అనుకున్నదానికంటే ఎక్కువ హాని చేస్తున్నాయి. కాబట్టి మీ బ్రష్‌లను శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం.

అర‌టి తొక్కే అని తేలిగ్గా పారేయ‌కండి- ఇలా వాడితే మెరిసే చ‌ర్మం మీ సొంతం!

సన్‌స్క్రీన్ ధరించకపోవడం : చర్మం వృద్ధాప్యం నుంచి రక్షణ పొందాలంటే.. బెస్ట్​ ఆప్షన్​ సన్‌స్క్రీన్. ఇది శీతాకాలంలో కూడా ప్రతిరోజూ ఉపయోగించాలి. దీనికి 30 లేదా అంతకంటే ఎక్కువ SPF ఉందని నిర్ధారించుకోవాలి. ప్రతిరోజూ మీ ఛాతీకి, మీ చేతుల పైభాగానికి అప్లై చేయడం మర్చిపోవద్దు.

కాటన్ పిల్లోకేస్‌పై పడుకోవడం : కాటన్ పిల్లోకేస్​పై నిద్రించడం కూడా మీ చర్మానికి హాని కలిగిస్తుంది. ఎందుకంటే దానిపై పడుకోవడం ద్వారా కాటన్ రాపిడి వల్ల చర్మం లోపల ఉండే కొల్లాజెన్ విచ్ఛిన్నం కావొచ్చు. దాంతో శాశ్వత మడతలు ఏర్పడవచ్చు. కాబట్టి వీలైనంతవరకు కాటన్​ పిల్లోకేస్​కు దూరంగా ఉండండి.

ప్రొడక్ట్స్ కఠినంగా రుద్దడం : మీరు చర్మ సంరక్షణ కోసం యూజ్ చేసే ప్రొడక్ట్స్ కఠినంగా రుద్దొద్దు. అలా చేయడం ద్వారా కూడా చర్మం దెబ్బతింటుంది.

మొటిమలు గిల్లడం : యుక్తవయసులో మొటిమలు రావడం సహజం. కానీ చాలా మంది వాటిని గిల్లతుంటారు. ఇలా చేస్తే అవి నల్లటి మచ్చలుగా మారుతాయి. దీంతో ముఖం అందవిహీనంగా మారుతుంది.

చర్మతత్వానికి సరిపోయే ఉత్పత్తులను ఉపయోగించకపోవడం : చర్మానికి ఉపయోగించే ఫెయిర్​నెస్ క్రీమ్స్ విషయంలోనూ జాగ్రత్త వహించాలి. అందుకోసం ముందు చర్మం తత్వాన్ని తెలుసుకోవాలి. ఆ తర్వాత మీ చర్మం తీరు తెలుసుకొని దానికి తగ్గ ఫేస్​ క్రీములు ఉపయోగించాలి. కానీ ఏవి పడితే అవి యూజ్ చేయొద్దు.

ఈ ఆహారం తీసుకుంటే మీ చర్మం నిగనిగలాడాల్సిందే!

సరైన ఆహారం తీసుకోకపోవడం : మీ తినే ఆహారం కూడా మీ చర్మాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి వీలైనంత వరకు చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసే కూరగాయలు, పండ్లు రోజు వారి ఆహారంలో ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు లభించి చర్మానికి అవసరమైన మరమ్మతులు చేస్తాయి.

ఈ పొరపాట్లతో పాటు మరికొన్ని ఉన్నాయి. అవేంటంటే రోజూ తగినంత నిద్ర లేకపోయినా, స్నానానికి, ఫేస్ వాష్​కి ఒకే టవల్ ఉపయోగించినా, వ్యాయామం చేసేటప్పుడు మేకప్ వేసుకున్నా... జుట్టును చాలా గట్టిగా ముడివేసినా, ఎక్స్​పైరీ డేట్ అయిపోయిన ఫేస్ క్రీమ్​లు వాడుతున్నా కూడా మీ చర్మం దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఈ పొరపాట్లు చేయకుండా ఉండండి. అప్పుడే మీ చర్మం మృదువుగా, ఆరోగ్యంగా ఉంటుంది.

గ్లోయింగ్ స్కిన్​ కావాలా? మీ డైట్​లో ఈ చిన్న మార్పులు చేస్తే సరి!

మగాళ్లూ.. ఈ 5 చిట్కాలు పాటిస్తే మెరిసే చర్మం మీ సొంతం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.