Artificial Sweetener Side Effects in Telugu : చాలా మంది షుగర్ పేషెంట్స్ చక్కెరకు బదులుగా కృత్రిమ తీపి పదార్థాలు (ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్) తీసుకుంటూ ఉంటారు. షుగర్ వ్యాధి రాకుండా జాగ్రత్తపడేవారు, బరువు తగ్గాలనుకునేవారు కూడా ఆహారంలో చక్కెరను తీసుకోవడం మానేసి.. కృత్రిమ తీపి పదార్థాలతో తయారైన కూల్‌డ్రింకులు, షుగర్ ఫ్రీ ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటారు. వీటిల్లో కేలరీలు లేకపోవటం వల్ల ఇవి తీసుకుంటే షుగర్, బరువు కంట్రోల్ ఉంటుందని అనుకుంటూ ఉంటారు. కానీ, కృత్రిమ తీపి పదార్థాలు ఆరోగ్యానికి హాని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆర్టిఫిషియల్ స్వీటెనర్ తీసుకోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
Artificial Sweetener Health Side Effects : కృత్రిమ తీపి పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలు..
గుండె సమస్యలు: ఆర్టిఫిషియల్ స్వీట్నర్ టైప్ 2 డయాబెటిస్, గుండె వ్యాధులకు కారకాలుగా పనిచేస్తాయని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. ఇంకా ఈ రకమైన స్వీట్నర్ ఇన్సులిన్ నిరోధకతను పెంచి కడుపులో మంట కలిగేలా చేస్తాయి.
పరగడపున టీ లేదా కాఫీ తాగుతున్నారా? ఇది తెలియకపోతే డేంజర్లో పడ్డట్లే!
పేగుల ఆరోగ్యంపై ప్రభావం..: ఆర్టిఫిషియల్ స్వీట్నర్ మన పేగుల ఆరోగ్యంపై దుష్ప్రభావాలను చూపిస్తాయని నిపుణులు అంటున్నారు. పేగుల్లో ఉండే బ్యాక్టీరియాలు గ్లూకోజ్‌ని ఎక్కువగా తీసుకోకుండా నిరోధిస్తాయని చెబుతున్నారు. దీనివల్ల గ్లూకోజ్ ఇంటోలరెన్స్, ఊబకాయం లాంటి వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉంటాయి. దీని వల్ల అజీర్ణ సమస్యలు కూడా వస్తాయి. ఎలుకలపై చేసిన పరిశోధనల్లో అర్టిఫిషియల్ స్వీట్నర్ పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాలను పాడు చేస్తున్నట్లు వెల్లడైంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, బరువు పెరిగిపోవడం జరుగుతున్నట్లు పరిశోధకులు గమనించారు.
బరువు పెరుగుతారు..: చాలా మంది.. ఆర్టిఫిషియల్ స్వీట్నర్తో చేసిన పదార్థాలు తీసుకుంటే బరువు తగ్గుతామనే భ్రమలో ఉంటారు. కానీ ఇవి మనం వెయిట్ గెయిన్ అవ్వడానికి కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి టేస్ట్‌బడ్‌లను బలహీనపరుస్తాయి. ఒక పరిశోధన ప్రకారం, తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారికి అధిక బరువు, ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది.
మెదడు పనితీరుపై ప్రభావం..: ఆర్టిఫిషియల్ స్వీట్నర్ వల్ల మెదడు పనితీరుపై దుష్ప్రభావాలు ఉంటాయని కొన్ని పరిశోధనల్లో శాస్త్రవేత్తలు తెలిపారు. అలాగే వీటిని ఒక్కసారి తినడం వల్ల మళ్లీ మళ్లీ తీపి తినాలన్న కోరిక కలుగుతుందని తెలిపారు. ఆ రకంగా కృత్రిమ తీపి పదార్థాలు మెదడును ప్రభావితం చేస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు. నాలుకపై ఉండే రుచి మొగ్గలు కూడా వీటి వల్ల దెబ్బతింటున్నాయని అంటున్నారు.
ఒక్కసారి అలవాటు చేసుకుంటే కష్టమే..: కృత్రిమ తీపి పదార్థాల్లో చక్కెర వంటి పదార్థాలు ఏవి ఉండవు. కాబట్టి, వీటిని ఉపయోగించి తయారు చేసిన పదార్థాలను తిన్నా శరీరంలో చక్కెర శాతం పెరగదు. దీంతో చాలా మంది షుగర్ ఉన్న వారు వీటిని తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఒక్కసారి వీటికి అలవాటు పడిపోతే మళ్లీ వీటిని మానడం కష్టమని నిపుణులు అంటున్నారు. అందుకే ఆరోగ్యంగా ఉండాలనుకునే షుగర్ పేషెంట్లు చప్పగా ఉండే టీ, కాఫీలను అలవాటు చేసుకోవాలని చెప్తున్నారు. కొంత మందిలో ఈ కృత్రిమ తీపి పదార్థాలను తీసుకోవడం వల్ల తలనొప్పి, మైకం రావడం, రక్తంలో చక్కెర స్థాయిలలో మార్పుల రావడం, గుండె జబ్బుల సమస్యలు పెరగడం వంటివి జరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు.
వీగన్ డైట్‌పై సందేహాలా? నిపుణుల క్లారిటీ ఇదే!
మెంతులతో ఎన్ని లాభాలో- మొటిమలకు చెక్- మీ ముఖంలో గ్లో పక్కా!