ETV Bharat / sukhibhava

అందం, ఆరోగ్యం.. చెరకు రసంతో సొంతం!

వేసవిలోనే కాదు.. కాస్త ఎండపొడ తగిలినప్పుడల్లా రోడ్డు పక్కన కనిపించే చెరకురసం బండిని చూస్తే అమృతం దొరికినంత ఆనందమేస్తుంది. కాస్తంత అల్లం, నిమ్మరసం తగిలించిన తాజా చెరకురసం తాగితే అలసట, నీరసం మాయమైపోయి శరీరం శక్తిని పుంజుకుంటుంది. అంతే కాదండోయ్.. మూడీగా ఉన్నప్పుడు కాస్త చెరకురసం సిప్ చేస్తే చిటికెలో మళ్లీ మామూలైపోతారు.! అంతేనా.. చెరకురసం ప్రయోజనాల గురించి చెప్పాలంటే చాలానే ఉన్నాయి.. వాటిలో కొన్నింటిని ఇప్పుడు తెలుసుకుందాం..

చెరకు రసంతో అందం
చెరకు రసంతో అందం
author img

By

Published : Apr 24, 2021, 10:00 AM IST

చెరకురసంతో చర్మకాంతి..

cherakubeneftsgg650-2.jpg
చెరకురసంతో చర్మకాంతి..

* చెరకురసంలో ముల్తానీ మట్టిని కలిపి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి పట్టిస్తే చర్మంపై ఉన్న నల్లమచ్చలు తొలగిపోతాయి. ఇందులో ఉండే ఆల్ఫా హైడ్రాక్సిల్ ఆమ్లాలు చర్మకణాలను పునరుజ్జీవింపచేస్తాయి.
* చెరకురసంలో తేనె కలిపి పావుగంటపాటు చర్మానికి మర్దనా చేయాలి.తర్వాత ఇరవై నిమిషాలపాటు ఉంచి కడిగేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది.
* కాఫీపొడికి కాస్త చెరకురసాన్ని చేర్చి స్క్రబ్‌లా ఉపయోగిస్తే చర్మం కాంతులీనుతుంది.
* నిమ్మరసం, యాపిల్ జ్యూస్, ద్రాక్షరసం, కొబ్బరి పాలు, చెరకురసాలను సమపాళ్లలో కలిపి చర్మానికి పట్టించాలి. దీనివల్ల వాటిలో ఉండే ల్యాక్టిక్, మాలిక్, సిట్రిక్ ఆమ్లాలు చర్మంపై ఉన్న మొటిమలు, మచ్చలను తొలగించి, ఆరోగ్యంగా తయారుచేస్తాయి.

cherakubeneftsgg650-5.jpg
చర్మం బిగుతుగా..

* బొప్పాయి గుజ్జులో చెరకురసాన్ని కలిపి పట్టించడం వల్ల చర్మం బిగుతుగా తయారవుతుంది.
* నాలుగు చెంచాల చెరకురసానికి రెండు చెంచాల నేతిని చేర్చి, చర్మానికి మర్దనా చేస్తే ఎండ వల్ల కమిలిన చర్మం తిరిగి కొత్త నిగారింపును సంతరించుకుంటుంది.
* లీటరు నీటిలో గుప్పెడు పుదీనా ఆకులు, పావులీటరు చెరుకురసం కలిపి, మరిగించి ఆవిరి పట్టుకుంటే చర్మం తేటగా తయారవుతుంది.
* చర్మాన్ని యవ్వనంగా, బిగుతుగా ఉంచడానికి మామూలు ఐస్‌క్యూబ్‌ల కన్నా చెరకురసంతో తయారయిన ఐస్ క్యూబ్‌లను వాడితే రెట్టింపు ఫలితాలుంటాయి.
* ఎటువంటి పదార్థాలూ కలపకుండా అచ్చంగా చెరకురసాన్నే ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు చర్మానికి పట్టించుకున్నా చర్మం ఆరోగ్యంగా, మృదువుగా తయారవుతుంది.

కురులకు కొత్త కళ..

cherakubeneftsgg650-1.jpg
జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..

* ప్రతిరోజూ చెరకురసం తాగడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
* చెరకురసాన్ని కుదుళ్లకు పట్టించి గంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే పొడిబారిన జుట్టు తిరిగి మెరుపును సంతరించుకుంటుంది.
* చెరకురసం జుట్టుకు సహజమైన కండిషనర్‌గా ఉపయోగపడుతుంది.

ఆరోగ్యానికి అంతులేని ప్రయోజనాలు

cherakubeneftsgg650-3.jpg
ఆరోగ్యానికి అంతులేని ప్రయోజనాలు

* చెరకురసంలో కాస్తంత నిమ్మరసం, కొబ్బరి నీళ్లు కలుపుకుని తాగడం వల్ల ప్రొటీన్ లోపాలను అరికట్టవచ్చు.
* తరచూ చెరకురసం తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
* చెరకురసంతో పుక్కిలించడం వల్ల నోటి దుర్వాసన మాయమవుతుంది.
* జీర్ణక్రియ మెరుగుపరచడానికి, మలబద్ధకాన్ని నివారించడానికీ చెరకురసం బాగా పనిచేస్తుంది.
* ఇది లివర్ పనితనాన్ని మెరుగుపరుస్తుంది.
* చెరకురసంలో పుష్కలంగా లభించే ఐరన్ రక్తహీనతను దూరం చేస్తుంది.
* ఇందులోని ఫోలిక్ ఆమ్లాలు, బి9 విటమిన్లు ఆడవారిలో ప్రత్యుత్పత్తి సమస్యలను నివారిస్తాయి. గర్భధారణ సమయంలో పిండానికి బలాన్ని చేకూరుస్తాయి.
* చెరకురసంలోని క్యాల్షియం నిల్వలు ఎముకలు, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. మధుమేహం, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం చెరకురసం తాగే విషయంలో సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించాలి
గమనిక:
కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆరోగ్యకరమైన పద్ధతిలో రసం తీసి, విక్రయించే చోట మాత్రమే దీనిని కొనుగోలు చేయడం మంచిది. ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించవద్దు.

ఇదీ చూడండి: వేపతో సౌందర్య చిట్కాలు.. ఇవి చాలా ఈజీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.