ETV Bharat / sukhibhava

స్వచ్ఛమైన గాలితో కరోనాకు చెక్​ పెట్టండిలా..

మార్పులు చిన్నవైనా.. ఫలితాలు మాత్రం తీవ్రంగా ఉంటాయి. కొద్ది నెలలుగా విస్తరిస్తున్న కరోనా మాహమ్మారి విషయంలోనూ ఇదే స్పష్టమవుతోంది. ముఖ్యంగా గాలి ద్వారా వైరస్​ వ్యాప్తి అధికంగా ఉన్నట్టు అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే.. భవనాలు, ఇళ్లు, హోటళ్లు వంటి వాటిలో గాలి ధారళంగా వచ్చేలా ఏర్పాటుచేసుకుంటే వైరస్​ ముప్పును తగ్గించుకోవచ్చుని నిపుణులు చెబుతున్నారు.

ADEQUATE VENTILATION CAN REDUCE THE RISK OF COVID-19
'స్వచ్ఛమైన గాలి'తో కరోనాకు చెక్​ పెట్టండిలా..
author img

By

Published : Nov 25, 2020, 10:11 AM IST

చిన్న మార్పయినా చాలు.. పెద్ద ఫలితమే చూపిస్తుంది. కరోనా జబ్బు విషయంలోనూ ఇది ముమ్మాటికి నిజం. ఉదాహరణకు గాలి ప్రవాహాన్నే తీసుకోండి. భవనాల్లో గానీ ఇళ్లలో గానీ ధారాళంగా గాలి వచ్చేలా చూసుకుంటే కొవిడ్‌-19 ముప్పును చాలావరకు తగ్గించుకోవచ్చు. కరోనా వైరస్‌ గాలిలో కలిసే తుంపర్ల ద్వారానూ వ్యాపించొచ్చు. ఇది వైరస్‌ వ్యాప్తికి ఎంతవరకు దోహదం చేస్తుందన్నది కచ్చితంగా తెలియదు గానీ ముప్పయితే పొంచి ఉంటుందన్నది మాత్రం ఖాయం. గాలి, వెలుతురు అంతగాలేని చోట్ల ఎవరైనా కరోనా బాధితులు ఉన్నారంటే.. అక్కడ ఎక్కువసేపు గడిపిన ఇతరులకూ వైరస్‌ అంటుకునే అవకాశం ఎక్కువ. చాలామంది ఉద్యోగులు, కార్మికులు పనిచేసే చోట్ల ఇలాంటి ప్రమాదం లేకపోలేదు. అందుకే చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవటం, ఇతరులకు దూరాన్ని పాటించటం వంటి వాటితో పాటు గాలి ధారాళంగా వచ్చేలా చూసుకోవాలన్నది నిపుణుల సూచన.

చిన్న తుంపర్లలోనూ వైరస్​..

వైరస్‌ బయటకు వెళ్లటానికి గాలి ఎంతగానో ఉపయోగపడుతుంది. కరోనా బారినపడ్డవారు దగ్గినా, తుమ్మినా, మాట్లాడినా, పాడినా, చివరికి శ్వాస వదిలినప్పుడూ తుంపర్లు బయటకు వస్తాయి. వీటిల్లోని వైరస్‌ గాలిలోనూ కలుస్తుంది. ఇది ఇతరులకు వ్యాపించే అవకాశముంది. ముఖ్యంగా కరోనా బాధితులకు దగ్గరగా ఉన్నవారికి కళ్లు, నోరు, ముక్కు ద్వారా వైరస్‌ అంటుకునే అవకాశముంటుంది. కరోనా చికిత్స కేంద్రాల్లో బాధితులకు శ్వాసమార్గంలో గొట్టాన్ని అమర్చటం వంటి సందర్భాల్లోనే చిన్న తుంపర్ల ద్వారా వైరస్‌ గాలిలో కలిసే అవకాశముంటుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ పేర్కొంటోంది. కానీ.. భవనాలు, కార్యాలయాలు, హోటళ్లలోనూ చిన్న తుంపర్లతో వైరస్‌ వ్యాపించొచ్చు.

ఒకరి నుంచి 94 మందికి..

చైనా, అమెరికా వంటి దేశాల్లో ఇలాంటి ఉదంతాలు చాలా వరకు వెలుగుచూశాయని తేలింది. పెద్ద తుంపర్లతో పోలిస్తే చిన్న తుంపర్లు గాలిలో ఎక్కువ దూరం ప్రయాణించొచ్చు గానీ దూరానికి వెళ్తున్నకొద్దీ దానిలోని వైరస్‌ సంఖ్య పడిపోతుంటుంది. అందుకే ఆరుబయట ఇలాంటి వైరస్‌ అంతగా ఇన్‌ఫెక్షన్‌కు దారితీయకపోవచ్చు. తలుపులు, కిటికీలు మూసి ఉండే భవనాలు, ఫ్యాక్టరీల్లో మాత్రం ముప్పు ఎక్కువగా ఉనట్టు తెలుస్తోంది. దక్షిణకొరియాలో ఒకరి నుంచి 94 మందికి కరోనా వైరస్‌ సోకడమే దీనికి నిదర్శనం. వీరంతా ఒకే అంతస్తులో పనిచేసేవారే కావటం గమనార్హం. గాలిలో కరోనా వైరస్‌ కనీసం 30 నిమిషాల సేపు ఉండగలదని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కాబట్టే బ్రిటన్‌ వంటి దేశాల్లో కొన్ని సంస్థలు సెంట్రలైజ్డ్‌ ఏసీలకు బదులుగా బయటి గాలి లోపలికి వచ్చేలా చూసుకోవటానికే ప్రాధాన్యమిస్తున్నాయి. మన దగ్గరా అలాంటి ప్రయత్నాలు చేయటమే మంచిది. స్వచ్ఛమైన గాలిలో ఆక్సిజన్‌ ఎక్కువగా ఉంటుంది. ఇందులో వైరస్‌ ఉన్నా ఎక్కువసేపు జీవించి ఉండలేదు. ఒకవేళ ఉన్నా గాలి వీస్తుంటే కిటికీలు, తలుపుల ద్వారా బయటకు వెళ్లిపోతుంది.

ఇదీ చదవండి: ప్రశాంతమైన నిద్రకు నాలుగు గ్యాడ్జెట్‌లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.