ETV Bharat / sukhibhava

శారీరక, మానసిక ఒత్తిడి.. దీని ఉపయోగంతో పరార్​! - బార్లీ జావ ఆరోగ్యం

రోజంతా పనులు చేస్తూ శారీరకంగా అలసిపోవడమే కాకుండా.. చాలామంది మానసిక ఒత్తిడినీ ఎదుర్కొంటున్నారు. అయితే అలాంటి సమస్యలకు బార్లీ గింజలతో చెక్​ పెట్టొచ్చు. అదెలాగో తెలుసుకోండి.

A glass a day of Barley water can do wonders for your health
బార్లీతో శారీరక, మానసిక ఒత్తిడి పరార్​!
author img

By

Published : Aug 25, 2021, 7:59 AM IST

ఇంటా బయటా మహిళలు పనితో శారీరకంగా అలసి పోవడమే కాదు.. మానసిక ఒత్తిడికీ గురవుతుంటారు. ఈ అలసట, ఆందోళనలతో అనారోగ్యాలు దాడి చేస్తుంటాయి. అలాంటి సమస్యలకు బార్లీతో చెక్‌ పెట్టొచ్చు.

  • శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు బార్లీలో పుష్కలంగా దొరుకుతాయి.
  • ఉడికించిన బార్లీ గింజల్లో కొంచెం నిమ్మరసం, దానిమ్మ గింజలు, నానబెట్టిన పెసలు కలిపి తింటే ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌ అవుతుంది. క్రమం తప్పకుండా బార్లీని ఆహారంలో భాగం చేసుకుంటే చర్మం కాంతిమంతంగానూ మారుతుంది.
  • బార్లీ గింజల్లో దొరికే క్యాల్షియం, కాపర్‌, మెగ్నీషియం, జింక్‌ వంటి ఖనిజాలు ఎముకలను దృఢంగా ఉంచుతాయి. పీచు ఎక్కువగా ఉండటంవల్ల ఆహారం తేలిగ్గానూ అరుగుతుంది.
  • బార్లీ జావ ఆకలిని పెంచుతుంది. ఊబకాయాన్ని తగ్గిస్తుంది. మధుమేహం, హృద్రోగాలు, కొన్ని రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. మరీ ముఖ్యంగా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా కాపాడుతుంది. ఇందులో ఉన్న బీటా గ్లూకాన్స్‌ కొలెస్ట్రాల్‌ స్థాయిని నియంత్రిస్తాయి.
  • అరకప్పు బార్లీ గింజలను ఆరు కప్పుల నీళ్లతో ఉడికించి వడకట్టి తాగితే కిడ్నీ సమస్యలే కాదు, ఇతర అనారోగ్యాలూ తలెత్తవు.

ఇదీ చూడండి.. శక్తి కావాలా.. ఇదిగో జావ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.