ETV Bharat / sukhibhava

'వెట్ వైప్స్'ను ఇలా వాడితే అంతే...! - wet wipes

శుభ్రతే ఆరోగ్యానికి తొలి మెట్టు అయిన సందర్భంలో.. బ్యాక్టీరియాను అంతం చేసే "వెట్ వైప్స్"కు డిమాండ్ బాగా పెరిగింది. అయితే, బ్యాక్టీరియాను చంపుతోంది కదా అని వైప్స్ ను ఎలా పడితే అలా వాడేస్తే.. మొదటికే మోసం వస్తుంది. మరి.. వెట్ వైప్స్ ను వాడకూడని పద్ధతేంటో తెలుసుకుందాం రండి....

8 Common Mistakes While Using Wet Wipes
'వెట్ వైప్స్'ను ఇలా వాడితే అంతే...!
author img

By

Published : Aug 10, 2020, 10:31 AM IST

టిష్యూ పేపర్ మాదిరిగా కనిపిస్తూ.. కాస్త తడిగా, వైరస్​ను అంతం చేయగల రసాయనంలో ముంచి తీసిన "వెట్ వైప్స్" కరోనా కాలంలో బాగా ఉపయోగపడుతున్నాయి. వీటిని సాధారణంగా పిల్లల డైపర్లు మార్చాక వారి చర్మాన్ని తుడవడానికి వాడుతారు. అంతే కాదు ఇంట్లో, కారులో ఉపరితలాలపై వైరస్​ను అంతం చేసేందుకు వినియోగిస్తారు. ఇప్పుడు, మార్కెట్లో బోలెడన్ని యాంటీ-బాక్టీరియల్ వైప్స్ దొరుకుతున్నాయి. కానీ, వాటిని ఎలా వాడాలో తెలియక అనారోగ్యాన్ని కొని తెచ్చుకోకండి.. ఈ చిట్కాలు ఫాలో అయిపోండి..

8 Common Mistakes While Using Wet Wipes
వెట్​ వైప్స్​ను ఇలా వాడితే అంతే..!
  • శరీరమంతా వాడుతున్నారా?

వెట్ వైప్స్​ను శరీర సున్నిత భాగాలపై వాడితే.. దురద, దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉంది. వాటిని తడిగా ఉంచేందుకు వాడే రసాయనాలు అన్ని చర్మ రకాలకు సరిపోవు. అందుకే ముఖంపై, చిన్నారుల శరీరంపై వీటిని వాడనేకూడదు.

  • బట్టలు తుడవద్దు..

వైప్​తో ఉపరితలాలు శుభ్రం చేయొచ్చన్నారు కదా అని బట్టలు, సోఫాలపై ప్రయోగించకండి. ఎందుకంటే... వాటిలోని రసాయనాలు దారపు పోగులను నాశనం చేస్తాయి. అందుకే, కఠిన ఉపరితలాలకే వైప్స్ వాడాలి.

  • ఒకటే మళ్లీ మళ్లీనా..?

టీవీ తుడిచాక దుమ్మేమి అంటలేదు కదా అని దాన్నే తీసుకెళ్లి ఫ్రిడ్జ్ తలుపు తుడిచేస్తాం. కానీ, కంటికి కనిపించని బ్యాక్టీరియా మన కళ్లుగప్పి ఫ్రిడ్జ్​పై చేరుతుందని గ్రహించం. కాబట్టి, ఒకటే వైప్​ను మళ్లీ మళ్లీ వాడకపోవడమే మంచిది.

  • పండ్లు తుడుస్తున్నారా?

పండ్లపై బ్యాక్టీరియా ఉంటుంది.. అలా అని బ్యాక్టీరియాను చంపే వైప్ పట్టుకుని పండ్లు తుడిచేస్తే.. ఆ రసాయనాన్ని మనం తినాల్సొస్తుంది. అందుకే, యాపిల్, జామ వంటి పండ్లు తెచ్చుకున్నప్పుడు శభ్రంగా నీటితో కడిగి తినేయండి. మరీ డౌట్​గా ఉంటే, కాసిన్ని గోరు వెచ్చని నీటితో కడగండి. అంతే,గానీ, వైప్స్ వాడి అనారోగ్యాన్ని కొని తెచ్చుకోకండి.

  • బొమ్మలకు వైప్స్ వద్దు...

పిల్లలు నోట్లో పెట్టుకుని ఆడుకునే బొమ్మలను రసాయనాలు నిండిన వైప్స్​తో తుడిస్తే ప్రమాదకరమే. కాకపోతే వాటిని వేడి నీటితో శుభ్రం చేసుకోవచ్చు.

  • ముందు దుమ్ము తుడిచాకే..

అద్దం తుడవాలనుకున్నారనుకోండి.. వెట్ వైప్స్ ఉన్నాయి కదా అని సరాసరి వాటితో తుడవకండి. ఎందుకంటే, అలా తుడవడం వల్ల దానిపై ఉన్న దుమ్ము మాత్రమే పోతుంది, బ్యాక్టీరియా అలాగే ఉండిపోతుంది. అందుకే, ముందు ఓ బట్టతో దుమ్ము తొలగించి. ఆపై వైప్స్​తో బ్యాక్టీరియా పనిపట్టండి.

  • జాగ్రత్తగా పడేయండి..

వైప్స్​తో పని అయిపోయాక.. వాటిని టాయిలెట్స్​లో, రోడ్ల మీద పడేయకండి. బ్యాక్టీరియాను అలా పడేయడం వల్ల పర్యావరణానికే కాదు, మన ఆరోగ్యాలకు మంచిది కాదు. కాబట్టి, వాడేసిన వైప్స్​ను సరైన పద్ధతిలోనే చెత్త బుట్టలో వేయడం లేదా, వైప్ బర్నర్​లో ధ్వంసం చేయాలి.

  • భద్రంగా ఉంచుకోకండి..

కార్​లో, బహిరంగ ప్రదేశాల్లో వైప్స్ పెడితే వేడికి వాటిలోని రసాయనం పూర్తిగా ఆవిరైపోతుంది. ఆ తర్వాత వాటిని వాడినా ప్రయోజనం ఉండదు. అందుకే, చల్లటి పొడి ప్రదేశంలో మాత్రమే వైప్స్​ను పెట్టుకోవాలి.

ఈ జాగ్రత్తలతో పాటు ప్యాకెట్​పై ఉండే సూచనలు తప్పకుండా చదివాకే.. వైప్స్ వినియోగించండి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.

ఇదీ చదవండి:పాలిచ్చే తల్లులు.. ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.