ETV Bharat / sukhibhava

చెమట వాసనను పోగొట్టే 15 సులభ మార్గాలు..!

చక్కని పెర్ఫ్యూమ్ వాసన రాగానే చుట్టుపక్కల వాతావరణం ఆహ్లాదకరంగా మారినట్లనిపిస్తుంది. సువాసనలు వెదజల్లే వారిని చూడగానే అసంకల్పితంగా చిరునవ్వుతో పలకరిస్తాం. అదే.. శరీరం నుంచి దుర్గంధం వచ్చే వారితో మాట్లాడేటప్పుడు కాస్త అసౌకర్యంగా ఫీలౌతాం. ఇది వివక్ష అనుకుంటే పొరబాటే.. ఎందుకంటే మనుషుల్లో ఈ ప్రవర్తన అమ్మ కడుపులో పడ్డ ఆరోనెల నుంచే మొదలౌతుందట..! అందుకే దుర్గంధం వెదజల్లే వస్తువులు, మనుషులు దగ్గరలో ఉన్నప్పుడు ఇబ్బంది పడతాం. అదే వాసన మన శరీరం నుంచే వస్తుంటే అందరికీ దూరంగా నిలబడతాం. ఎవరైనా చనువుగా దగ్గరికి వస్తే అసౌకర్యానికి గురౌతాం. శరీర దుర్వాసన మన ఆత్మవిశ్వాసంపై ఎంతగానో ప్రభావం చూపుతుందన్నది కాదనలేని సత్యం. ప్రత్యేకించి వేసవిలో ఎక్కువగా బాధించే ఈ సమస్యను సహజంగా అధిగమించడానికి అనేక మార్గాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం...

15 ways to overcome body odor
15 ways to overcome body odor
author img

By

Published : Apr 22, 2021, 8:49 PM IST

summersweatgh650-13.jpg
చెమట ఎందుకు వస్తోంది?

అసలు చెమట ఎందుకు పడుతుంది..?

  • వాతావరణంలో వేడి పెరిగినప్పుడు శరీర ఉష్ణోగ్రతలు తగ్గించడానికి, చెమట రూపంలో తేమ ఉత్పత్తవుతుంది. అధిక శ్రమకు గురైనప్పుడు శరీరంలో పుట్టే వేడిని అదుపు చేయడానికీ చెమట పడుతుంది.
  • కానీ కొందరికి ఏకాస్త శ్రమపడ్డా, రెండు నిమిషాలు వేడి తగిలినా చాలు చెమట వరదలౌతుంది. ఇందుకు అనేక కారణాలున్నాయి. విపరీతమైన చెమట మనం గమనించని ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు.
  • మధుమేహం, గుండె లోపలి పొరలో కలిగిన ఇన్ఫెక్షన్(ఎండో కార్త్డెటిస్), జ్వరం, సాధారణ ఒత్తిడి, గుండె పోటు, హైపర్ హైడ్రాసిస్, హైపర్ థైరాయిడిజం, యాంటీ డిప్రెసెంట్ల వల్ల దుష్ప్రభావాలకు లోనైనప్పుడు, మెనోపాజ్, వూబకాయం..మొదలైన సమస్యలు ఉన్నప్పుడు కూడా విపరీతంగా చెమట పట్టే అవకాశం ఉంది..
  • వీటిలో ఏదైనా సరే... అసాధారణమైన చెమటకు కారణం కావచ్చు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో తప్పకుండా డాక్టరును సంప్రదించాలి.
summersweatgh650-6.jpg
చెమట పడితే చెడు వాసన ఎందుకు..?

చెమట పడితే చెడు వాసన ఎందుకు..?

మన శరీరంలోని మలినాలు చెమట ద్వారా బయటికి రావడం వల్ల చెమట చెడువాసన కలిగి ఉంటుందని చాలామంది అభిప్రాయం. కానీ అసలు విషయం ఏంటంటే...చర్మం పైన ఉన్న బ్యాక్టీరియా చెమటలోని ప్రొటీన్లను గాఢమైన ఆమ్లాలుగా విడగొట్టడం వల్ల, వాటినుంచి చెడు వాసనలు వస్తాయి. అందుకే చర్మాన్ని తరచూ శుభ్రం చేసుకుంటే చెమట వల్ల వచ్చే దుర్వాసన తగ్గుతుంది. అలాగే శరీరంలోని నీటి శాతాన్ని తగ్గనివ్వకుండా చూసుకోవాలి. డిటాక్సిఫికేషన్ ద్వారా కూడా చెమట వల్ల వచ్చే దుర్గంధాన్ని తగ్గించవచ్చు.

చెమట వాసనను నివారించే మార్గాలు..

వేసవిలో అధికంగా బాధించే చెమట వాసనని నివారించడానికి కొన్ని మార్గాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం..

summersweatgh650-12.jpg
నిమ్మకాయ

చర్మాన్ని ఇలా శుభ్రపరచుకోవాలి..
1. నిమ్మకాయను రెండు భాగాలుగా తరగాలి. చెమట ఎక్కువగా పట్టేచోట కొద్దిగా పిండుతూ ఆ నిమ్మచెక్కతో రుద్దాలి. ఆరాక వదులైన కాటన్ దుస్తులను ధరిస్తే 16 నుంచి 24 గంటల పాటు చెమట వాసన ఉండదు.

summersweatgh650-8.jpg
బేకింగ్ సోడా

2. రెండు చెంచాల నిమ్మరసాన్ని నాలుగు చెంచాల బేకింగ్ సోడాలో కలిపి, చెమట పట్టేచోట ప్యాక్‌లా వేయాలి. ఆరాక స్క్రబ్ చేస్తూ రుద్ది, నీటితో కడిగేస్తే రోజంతా తాజాగా ఉంటారు.

3. చెమట వాసన ఎక్కువగా ఉండే చోట, రబ్బింగ్ ఆల్కహాల్లో ముంచిన దూదితో శుభ్రంచేస్తే 24 గంటలపాటు శరీర దుర్వాసను అరికట్టవచ్చు.

summersweatgh650-2.jpg
యాపిల్ సిడర్ వెనిగర్

4. యాపిల్ సిడర్ వెనిగర్ కూడా చెమట వాసనను దూరం చేసేందుకు పనికొస్తుంది. ఇందులో ముంచిన కాటన్‌బాల్ లేదా కాటన్ ప్యాడ్స్‌తో చర్మాన్ని తుడవటం వల్ల చాలాసేపు చెమట వాసన రాకుండా ఉంటుంది.

summersweatgh650-4.jpg
మౌత్ వాష్ లేదా టూత్‌పేస్ట్

5. మౌత్ వాష్ లేదా టూత్‌పేస్ట్‌తో చెమట పట్టే ప్రదేశాలను శుభ్రం చేసినా ఫలితం ఉంటుంది. వారానికి మూడు సార్లు ఇలా చేయవచ్చు. నెల రోజుల పాటు ఇలా చేసిన తర్వాత, ఒక నెల రోజుల పాటు ఆపి మళ్లీ ప్రారంభించవచ్చు.. గాఢమైన ఆల్కహాల్, క్లీనింగ్ ఏజెంట్లు చర్మం పైపొరను పొడిబార్చకుండా ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.

summersweatgh650-5.jpg
లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్

6. టీట్రీ ఆయిల్, లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్, పెప్పర్‌మింట్ ఆయిల్... వీటిలో ఏదైనా ఒకదాన్ని స్నానం చేసే నీటిలో ఆరు చుక్కలు కలపాలి. లేదా ఎప్సమ్ బాత్ సాల్ట్‌తో కలిపి స్నానపు తొట్టిలో వేసి అందులో అరగంటపాటు సేద తీరినా.. శరీరం సుగంధాలు వెదజల్లడమే కాదు మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.

7. ఒక బకెట్ నీటిలో మూడు గ్రీన్‌టీ బ్యాగ్‌లను వేసి ఆ నీటిని నేరుగా స్నానానికి ఉపయోగించినా లేదా స్నానపు తొట్టిలో ఆ నీటిని పోసి, ఇరవై నిముషాల పాటు, అందులో సేదతీరినా శరీర దుర్వాసన పోవడంతో పాటు చర్మం కాంతివంతమవుతుంది.

summersweatgh650-11.jpg
టమాటా రసం

8. స్నానపు తొట్టిలోని నీటికి రెండు కప్పుల టమాటా రసం చేర్చి, అందులో అరగంట పాటు గడిపినా ఫలితం ఉంటుంది.

summersweatgh650-9.jpg
నాలుగు కప్పుల గులాబీ రేకులు

9. బాత్ టబ్‌లోని నీటికి నాలుగు కప్పుల గులాబీ రేకులను లేదా అర కప్పు రోజ్ వాటర్‌ను కలపాలి. అందులో 20 నిముషాల పాటు సేద తీరితే సుగంధాలు వెదజల్లే గులాబీ బాల మీరే అవుతారు.

summersweatgh650-1.jpg
గుప్పెడు వేపాకులు

10. స్నానపు నీటికి గుప్పెడు వేపాకులను చేరిస్తే, చర్మంపై గల బ్యాక్టీరియా తొలగిపోతుంది. దీనివల్ల శరీర దుర్వాసన తగ్గడమే కాకుండా అనేక చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయి.
చెమట ఎక్కువగా ఉండే శరీర భాగాలను ఈ పద్ధతుల్లో శుభ్రం చేసుకుంటే దుర్వాసనను తాత్కాలికంగా జయించవచ్చు.

చెమటకు ప్రత్యేకమైన పౌడర్..

మామూలు టాల్కం పౌడర్‌లు అప్పటికప్పుడు సువాసనలు వెదజల్లినా.. చెమట పట్టగానే దానితో కలిసి మరింత దుర్వాసనకు కారణమౌతాయి. పైగా వాటిలోని రసాయనాలు చర్మరోగాలకు కారణమయ్యే అవకాశమూ లేకపోలేదు. అందుకే చెమటను పీల్చుకుని చర్మాన్ని తాజాగా ఉంచే సహజమైన పౌడర్‌ను ఇంట్లోనే తయారు చేయడమెలాగో తెలుసుకుందాం..

Summersweatgh650-3.jpg
మూడు టీస్పూన్ల కార్న్ స్టార్చ్

11. మూడు టీస్పూన్ల కార్న్ స్టార్చ్( మొక్కజొన్న పిండి)కి రెండు స్పూన్ల బేకింగ్ సోడా కలపాలి. ఈ మిశ్రమానికి పది చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ చేర్చాలి. దీన్ని వెలుతురు చొరబడని ప్రదేశంలో రెండు రోజులు ఉంచి, తర్వాత అవసరమైనప్పుడల్లా పౌడర్‌కి బదులుగా వాడుకోవాలి.

లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్‌కి బదులుగా పెప్పర్‌మింట్ ఆయిల్‌ని కూడా వాడుకోవచ్చు.

summersweatgh650-10.jpg
డిటాక్సిఫికేషన్

డిటాక్సిఫికేషన్ ఇలా..!

చర్మానికి పైపూతలుగా వాడే క్లెన్సర్లు, పౌడర్లతో పాటు శరీరాన్ని లోపలినుంచి డిటాక్సిఫై చేయడం వల్ల శరీర దుర్వాసనని పూర్తిగా అరికట్టవచ్చు. మరి ఆ డిటాక్సిఫయింగ్ పానీయాలేంటో తెలుసుకుందామా..!

12. రోజుకు రెండు సార్లు గ్రీన్ టీ తాగడం వల్ల శరీరం డిటాక్సిఫై అవుతుంది.

13. రెండు గ్లాసుల నీటిలో ఒక స్పూన్ మెంతులు వేసి, రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే మెంతులతో పాటు ఆ నీళ్లు మరిగించాలి. కాస్త చల్లార్చి, గోరు వెచ్చగా ఉండగా తాగాలి. జీర్ణక్రియను మెరుగుపరిచి, రక్తంలోని మలినాలను, కొవ్వులను తగ్గించడంలో ఇది ఉపయోగ పడుతుంది.

14. శరీరంలోని వాతాన్ని తగ్గించడానికి, జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి సోంపు ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఒక టీస్పూను సోంపును రెండు గ్లాసుల నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీటిని సోంపుతో పాటు మరిగించాలి. ఈ నీటిని కాస్త చల్లార్చి గోరువెచ్చగా ఉండగా తాగాలి. ఈ డిటాక్సిఫయింగ్ పానీయాలను క్రమం తప్పకుండా సేవిస్తే శరీర దుర్వాసనను అరికట్టవచ్చు.

15. శరీర దుర్వాసనను పోగొట్టేందుకు పెర్ఫ్యూమ్, డియోడరెంట్ వంటివి వాడే ముందు వాటిలో హాని కారక రసాయనాలు లేకుండా జాగ్రత్తపడండి.

ఇవీచూడండి: ఆర్టీసీపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.