ETV Bharat / sukhibhava

జలుబు, దగ్గే కాదు... ఇవి కూడా కరోనా లక్షణాలే!

కరోనా లక్షణాలంటే దగ్గు, ఆయాసం, శ్వాసకోశ సమస్యలు మాత్రమే అనుకుంటున్నారా? ఇంకా కొన్ని ఉన్నాయి. ఆకలి మందగించటం, విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి లక్షణాలున్నా వైద్యులను సంప్రదించాలట. వ్యాధి ముదిరే కొద్దీ ఈ లక్షణాలు బయటపడుతున్నట్లు నిపుణుల చెబుతున్నారు.

Slow hunger, diarrhea, vomiting, abdominal pain also coronavirus symptoms
ఆ లక్షణాలున్నయా.. అయితే కరోనా​ సోకినట్లే!
author img

By

Published : Mar 31, 2020, 2:51 PM IST

Updated : May 21, 2020, 4:50 PM IST

కరోనా అనగానే ముందుగా దగ్గు, ఆయాసం వంటి శ్వాసకోశ లక్షణాలే గుర్తుకొస్తాయి. ఇవే కాదు, చాలామందిలో విరేచనాలు, ఆకలి తగ్గటం వంటి జీర్ణకోశ సమస్యలూ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నట్టు చైనా నివేదిక ఒకటి పేర్కొంటోంది. అందువల్ల శ్వాస లక్షణాలు కనిపించేంత వరకూ వేచి చూడకుండా ఎవరిలోనైనా విరేచనాల వంటివి ఉంటే కొవిడ్‌-19ను అనుమానించటం తప్పనిసరని, దీంతో జబ్బు ముదరక ముందే పట్టుకోవచ్చని వివరిస్తోంది.

కరోనా ఇన్‌ఫెక్షన్‌ బాధితులు ఆసుపత్రిలో చేరాక సగటున 8.1 రోజులకు లక్షణాలు బయటపడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. జీర్ణకోశ లక్షణాలు మాత్రం ఇంకాస్త ఆలస్యంగా.. 9 రోజుల తర్వాత కనిపిస్తుండటం గమనార్హం. ఇది చికిత్స ఆలస్యం కావటానికీ దారితీస్తోంది. 'దగ్గు, ఆయాసం వంటివేవీ లేవు కదా, కరోనా ఇన్‌ఫెక్షన్‌ కాదేమో' అనే భావనతో త్వరగా డాక్టర్లను సంప్రదించటం లేదని పరిశోధకులు చెబుతున్నారు. జీర్ణకోశ లక్షణాలు గలవారిలో ఆకలి మందగించటం (84% మందిలో), విరేచనాలు (29%), వాంతులు (0.8%), కడుపునొప్పి (0.4%) వంటి సమస్యలెన్నో బయలుదేరుతున్నాయి. కరోనా తీవ్రమవుతున్నకొద్దీ ఇవీ ఎక్కువవుతూ వస్తున్నాయి.

ఇవి లేకపోవటం విశేషం!

ఆకలి మందగించటం, విరేచనాల వంటివి గలవారితో పోలిస్తే ఇలాంటివేవీ లేనివారు త్వరగా కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అవుతున్నట్టూ తేలింది. కొందరిలో శ్వాసకోశ లక్షణాలు అసలే లేకపోవటం విశేషం. అందువల్ల కరోనాను నిర్ధారించే విషయంలో దగ్గు, ఆయాసం వంటి వాటినే కాదు.. జీర్ణకోశ లక్షణాలనూ పరిగణనలోకి తీసుకోవటం ముఖ్యం. లేకపోతే శ్వాసకోశ లక్షణాలు బయటపడేంతవరకూ సమస్యను గుర్తించకుండా ఉండిపోయే ప్రమాదముందని, అప్పటికే ఇన్‌ఫెక్షన్‌ తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశముందని పరిశోధకులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి: ఆరోగ్య సిబ్బంది ప్రాణాలకు భరోసా కల్పిస్తేనే..!

Last Updated : May 21, 2020, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.