ETV Bharat / sukhibhava

వేసవిలో ఇవి తింటే డీహైడ్రేషన్​కు చెక్​! - Curd and Mango are useful to overcome dehydration

వేసవిలో చాలామంది తొందరగా డీహైడ్రేషన్​, శక్తిహీనతకు గురవుతుంటారు. అయితే పెరుగు, మామిడి పండు, దోసకాయతో ఈ సమస్యలకు చెక్​ పెట్టొచ్చంటున్నారు డాక్టర్​ దివ్య గుప్తా. అదెలాగో తెలుసుకోండి.

How to control dehydration in summer
వేసవిలో ఇవి తింటే డీహైడ్రేషన్​కు చెక్​!
author img

By

Published : May 7, 2020, 10:21 AM IST

Updated : May 21, 2020, 4:50 PM IST

వేసవి ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. భానుడి భగభగతో రోజువారీ ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. ఫలితంగా శరీరంలో నీటిశాతం తక్కువై.. చాలామంది డీహైడ్రేషన్​కు గురవుతున్నారు. తొందరగా శక్తిహీనులవుతున్నారు. మరి ఈ సమస్యలను అధిగమించడం ఎలా? ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే.. డీహైడ్రేషన్​, శక్తిహీనతకు చెక్​ పెట్టొచ్చు? అన్న ప్రశ్నలకు సమాధానంగా కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు డాక్టర్​ దివ్య గుప్తా (కన్సల్టెంట్​ న్యూట్రిషనిస్ట్​ అండ్​ డయాబెటిస్​ ఎడ్యుకేటర్).

ఇవి తీసుకుంటే సరి...

పెరుగు : ప్రోబయోటిక్ స్వభావం కారణంగా రోగనిరోధక శక్తి, జీర్ణక్రియను మెరుగుపరిచే పదార్థంగా పెరుగు పనిచేస్తుంది. మజ్జిగ, లస్సీ, రైతా... ఇలా వివిధ రూపాల్లో పెరుగును తీసుకోవచ్చు. వీటిలో అవిసె గింజ పొడిని కూడా చల్లుకోవచ్చు. శరీరంలో మంటను తగ్గించడంలో అవిసె గింజ ఉపయోగపడుతుంది.

మామిడి పండు : మామిడిలో విటమిన్ ఏ, బీ6, పొటాషియం, ఫైబర్​ అధికంగా ఉంటాయి. ఈ పండులో గ్లిజెమిక్​ ఇండెక్స్ (రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచడానికి కార్బోహైడ్రేట్ల ఆహార సాపేక్ష సామర్థ్యాన్ని సూచించే సంఖ్య)​ తక్కువగా ఉంటుంది. అందుకే షుగర్​ వ్యాధితో బాధపడుతున్నవారు కూడా మామిడిపండు తినొచ్చు. కాకపోతే.. తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి (రోజుకు సగం మామిడి పండు తింటే.. శరీరంలోని చక్కెర స్థాయిలో ఎలాంటి మార్పు ఉండదు).

చాలా మంది మామిడి పండు తింటే లావైపోతామని అనుకుంటారు. అది అవాస్తవం. మామిడిలో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో పోషకాలుంటాయి. తగిన మోతాదులో తీసుకుంటే.. ఆరోగ్యానికి మామిడి ఎంతో మంచిది.

దోసకాయ : దోసకాయ... ఫైబర్, నీటితో నిండి ఉంటుంది. అందువల్ల దీన్ని తీసుకుంటే శరీరంలో నీటిశాతం తగ్గకుండా ఉంటుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. దోసకాయ మీద కొద్దిగా ఉప్పు చల్లుకుని చిరుతిండిగా తీసుకోవచ్చు.

పుచ్చకాయ : పుచ్చకాయలో నీటిశాతం ఎక్కువ. విటమిన్​ సి, లైకోపీన్​తో పాటు ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. దీన్ని జ్యూస్​ లేదా ఐస్​ లాల్లీ రూపంలో తీసుకోవచ్చు. కానీ పుచ్చకాయ కోసం ఆహారాన్ని మానేయకండి. ఉదయం, మధ్యాహ్నానికి మధ్యలో ఒక చిన్న కప్పు తీసుకుంటే.. ఆరోగ్యానికి మంచిది.

గుమ్మడికాయ : శరీరంలో కొవ్వును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని పెంచేందుకు గుమ్మడికాయ సహాయపడుతుంది.

ఆరెంజ్​, దోసకాయ, పుదీనా జ్యూస్​ : ఈ జ్యూస్​ తీసుకుంటే.. మీ శరీరంలో నీటిశాతం తగ్గకుండా ఉంటుంది. జీవక్రియతో పాటు రోగనిరోధకశక్తి మెరుగుపడేందుకు ఇది సహాయపడుతుంది.

ఇదీ చూడండి : ఇక ఒక్క క్లిక్​తో ఆన్​లైన్​లో మద్యం

Last Updated : May 21, 2020, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.