యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను వైటీడీఏ వైస్ ఛైర్మన్ కిషన్‌రావు పరిశీలించారు. ప్రధాన ఆలయం, ముఖ మండపం, బాహ్య ప్రాకారం, బ్రహ్మోత్సవ మండపం వద్ద బోర్వెల్ సాయంతో చేపట్టిన పనులు, సాయిల్ స్టెబిలైజేషన్ ప్రక్రియ, ఫ్లోరింగ్ పనుల తీరుపై ఆరా తీశారు.
ప్రధానాలయం తూర్పు రాజగోపురం వద్ద జరుగుతున్న మరమ్మతు పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానాలయం, ముఖ మండపంలో కట్టడాలను శుభ్రపరిచే తీరును పరిశీలించారు.
ఇటీవల ఆలయాన్ని సందర్శించిన ఆర్కిటెక్ట్ ఆనందసాయి, ఆల్వార్ పిల్లర్ల పాలిషింగ్‌పై సూచనలు చేశారు. పాలిషింగ్ అనంతరం ఆకర్షణీయంగా కనువిందు చేయనున్నాయి.
ఇటీవల యాదాద్రికి వచ్చిన సీఎంవో భూపాల్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. అందుకు అనుగుణంగా సన్నిధి, పాత ఘాట్ రోడ్లో చేపడుతున్న పనులను అధికారులతో కలిసి కిషన్‌రావు పరిశీలించారు.
ఇవీచూడండి:వీహెచ్‌పీ నిరసనల్లో పాల్గొని హిందువుల ఐక్యత చాటుదాం: బండి