ఇవీ చదవండి:
ఆలయ నగరిగా రూపుదిద్దుకుంటోన్న ‘యాదరుషి నిలయం’.. మనమూ చూద్దామా..!
Yadarushi Nilayam in Yadadri : నాడు ముళ్లకంపలు.. బండరాళ్లు.. చెత్తతో చిందరవందరగా, ఎత్తుపల్లాలుగా ఉన్న పెద్దగుట్ట అది. యాదాద్రిలోని ఆ ప్రాంతమంతా నేడు ఆలయ నగరిగా రూపుదిద్దుకుంటోంది. అక్కడే విశాల రహదారులు, ఆహ్లాదకర పచ్చదనంతో ఆకట్టుకునేలా సరికొత్త కుటీరం సిద్ధమైంది. యాదాద్రి క్షేత్రం ఆవిర్భావానికి మూలమైన యాదవ మహర్షి పేరిట ‘యాదరుషి నిలయం’ నిర్మించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారం, సీఎం కేసీఆర్ సంకల్పంతో క్షేత్రాభివృద్ధికి పాటుపడుతున్న వైటీడీఏ రూ.3 కోట్లతో దీన్ని తీర్చిదిద్దింది. 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఈ కుటీరం మధ్యన సమావేశ మందిరం, కిచెన్, డైనింగ్‌హాల్, నాలుగు సూట్లు ఉంటాయి. పరిసరాల్లో యాదవ మహర్షి శిలా విగ్రహాన్ని సిద్ధం చేశారు. అక్కడి నుంచి యాదాద్రీశుల ఆలయం, యాదగిరిగుట్ట పట్టణం, పాతగుట్ట, భువనగిరి ఖిల్లాను తిలకించవచ్చు. ఈ కుటీరాన్ని వైటీడీఏ క్యాంపు కార్యాలయంగా వినియోగిస్తామని ఆ సంస్థ వైస్ ఛైర్మన్ కిషన్‌రావు తెలిపారు.
యాదాద్రిలో యాదరుషి నిలయం
ఇవీ చదవండి: