యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు నల్లందిగల్ లక్ష్మీ నరసింహాచార్యుల ఆధ్వర్యంలో 11 రోజుల పాటు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై, దేవాదాయశాఖ మంత్రితో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులకు ఆలయ అర్చకులు ఆహ్వాన పత్రాలు అందించారు.
బ్రహ్మోత్సవాల కోసం ఆలయ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నందున 4న ఉదయం కొండపైన... సాయంత్రం కొండ క్రింద కల్యాణం నిర్వహించనున్నారు. కొండ కింద నిర్వహించే కల్యాణానికి బస్టాండ్ ఎదురుగా ఉన్న పాత హైస్కూల్ మైదానాన్ని సిద్ధం చేస్తున్నారు. పెద్దఎత్తున తరలిరానున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఈవో గీతారెడ్డి తెలిపారు.