యాదాద్రి ప్రధానాలయానికి సరికొత్త హంగులతో కూడిన విద్యుత్ దీపాలంకరణ పనులు కొనసాగుతున్నాయి. ఆలయ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి పర్యవేక్షణలో ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లను గురువారం రాత్రి ట్రయల్ రన్‌గా చేపట్టారు. ఏర్పాటైన విద్యుత్ కాంతులతో ఆలయ గోపురాలు, మండపాలు స్వర్ణ కాంతులను విరజిమ్మాయి. ఆలయానికి ఉత్తరం, తూర్పు, అష్టభుజ మండప ప్రాకారాలకు బెంగళూరుకు చెందిన లైటింగ్ టెక్నాలజీ సంస్థ గత మూడు రోజులుగా ట్రైయల్ రన్ చేపట్టింది. పసిడి వర్ణములో విద్యుత్ దీప కాంతులతో ఆలయం దేదీప్యమానంగా వెలుగొందింది.
![yadadri temple lighting trail run](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nlg-85-10-yadadri-lighting-triyal-run-av-ts10134_10062021225607_1006f_1623345967_1083.jpg)
సీఎం కేసీఆర్ సూచనలతో... ఆనంద్ సాయి ఆర్కిటెక్చర్ పర్యవేక్షణలో... గోల్డెన్ టెంపుల్ తరహాలో ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. యాదాద్రి ఆలయానికి ఏర్పాటుచేసిన పసిడి కాంతుల విద్యుత్ దీపాల అలంకరణతో కూడిన వీడియోలు, ఫోటోలు భక్తులను పరవశింపజేస్తున్నాయి.
![yadadri temple lighting trail run](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nlg-85-10-yadadri-lighting-triyal-run-av-ts10134_10062021225607_1006f_1623345967_167.jpg)