తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ హుండీ లెక్కింపును అధికారులు నిర్వహించారు. ఆలయ ఈవో గీతారెడ్డి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపును నిర్వహించారు.
22 రోజుల్లో స్వామి వారి హుండీ ఆదాయం మొత్తం రూ. 24,74,478 లక్షలు కాగా... 29 గ్రాముల బంగారం, 700 గ్రాముల వెండి మిశ్రమ ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ మొత్తం ఆదాయాన్ని ఆలయ ఖజానాకు చేర్చనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.