యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి కావస్తున్న దశలో... వసతుల కల్పనపై యాడా అధికారులు దృష్టి సారించారు. ఆలయం వద్ద దర్శన క్యూలైన్ల ఏర్పాటుకు మాడ వీధుల్లోని తూర్పు రాజగోపురం వద్ద వైట్ మార్కింగ్ చేశారు. భక్తులు స్వయంభువుల దర్శనానికి వరుస క్రమంలో వెళ్లే విధంగా గ్రిల్స్ ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
చకచకా మెట్ల మార్గం పనులు...
యాదాద్రి వైకుంఠ ద్వారం వద్ద మెట్ల నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. పిల్లర్లతో అంతస్తులుగా స్లాబు పోసి మెట్ల నిర్మాణం చేపడుతున్నారు. ఇరువైపులా రెండు మార్గాలలో భక్తులు వైకుంఠ ద్వారానికి చేరే విధంగా ఈ నిర్మాణం జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఫోన్ దొంగిలించాడంటూ యువకున్ని చితకబాదిన హిజ్రా