తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు యాదాద్రి ఆలయ స్థానాచార్యులు సందుఘల రాఘవాచార్యులు తెలిపారు. ఉద్యోగ విరమణ పత్రాన్ని ఆలయ ఈవోకు సమర్పించారు. వ్యక్తిగత కారణాల వల్ల ఆలయ కైంకర్యాలలో విధులు సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నానని... దానితో పాటు అనారోగ్య కారణాల వల్ల పదవి నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. మూడున్నరేళ్లుగా స్థానాచార్యులుగా విధులు నిర్వర్తించారు.
స్థానాచార్యులు సమర్పించిన రాజీనామా పత్రాన్ని ఇంకా పరిశీలించలేదని ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి: యునెస్కో గుర్తింపునకు అడుగు దూరంలో రామప్ప ఆలయం..