యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి బాలాలయంలో నిత్య కైంకర్యాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు సుప్రభాత సేవ జరిపి, ఉత్సవమూర్తులకు పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆదివారం కావడం వల్ల ఆలయంలో భక్తులు సందడి నెలకొంది. స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.
కొండకింద సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. కల్యాణకట్టతో పాటు కొండపైన గర్భాలయం, మాడవీధులు, ప్రసాద విక్రయ కేంద్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీ దృష్ట్యా కొండ పైకి వాహనాలను అనుమతించడంలేదు.
స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడానికి ప్రత్యేక దర్శనానికి 1 గంట సమయం, ధర్మ దర్శనానికి 2గంటలు పడుతోంది. ఆరాధన, సహస్రనామార్చన, సువర్ణ పుష్పార్చన, నిత్య కల్యాణం, శ్రీ సుదర్శన హోమం, అష్టోత్తర పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: యాదాద్రిలోని శివాలయ సాలహారాలకు నూతన హంగులు