యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పదో రోజు మధ్యాహ్నం పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం బాలాలయంలో స్వామివారి చక్రస్నాన ఘట్టం వైభవంగా జరిగింది. బాలాలయంలో వెండి గంగాళంలో పుష్కరిణి జలంతో స్వామి, అమ్మవార్ల చక్రస్నాన మహాఘట్టాన్ని కన్నులపండువగా నిర్వహించారు.
ఈ మహాఘట్టానికి భక్తులు భారీగా తరలివచ్చారు. గురువారం ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.