యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని చాలా రోజుల తర్వాత తెరిచారు. మొదటగా స్థానికులు, ఆలయ సిబ్బంది, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ప్రయోగాత్మకంగా దర్శనాలు కల్పిస్తున్నారు. రేపటి నుంచి భక్తులందరికీ స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. ఉదయం కలెక్టర్ అనితా రామచంద్రన్, ట్రైనీ కలెక్టర్ గరీమా అగర్వాల్ స్వామివారిని దర్శించుకున్నారు.
భక్తులంతా లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి తొందరగా కనుమరుగయ్యేలా చూడాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు.
ఆధార్ ఉంటేనే అనుమతి
దర్శనానికి వచ్చే భక్తులు విధిగా మాస్కులు, ఆధార్ కార్డు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని ఈవో గీతారెడ్డి తెలిపారు. గర్భిణీ స్త్రీలు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, 10 ఏళ్ల లోపు వయసున్న పిల్లలు దర్శనానికి రాకుండా ఉండాలని కోరారు.
ఇవీ చూడండి: కరోనాపై పోరులో... స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష