ETV Bharat / state

యాదగిరి గుట్ట చుట్టూ వినూత్నంగా ప్రదక్షిణా పథం - yadadri bhuvanagiri district latest news

ఆలయాలకు వెళ్లే భక్తులు విధిగా పాటించేది ప్రదక్షిణలు. మరికొన్ని విశిష్ట క్షేత్రాలలో 'గిరి ప్రదక్షిణలు' అనేది ఓ ప్రత్యేకమైన విధిగా విలసిల్లుతోంది. ఓ పెద్ద కొండపై ఉన్న ఆలయానికి ప్రదక్షిణగా ఆ కొండ చుట్టూ ఏర్పరిచిన ప్రదక్షిణా మార్గంలో భక్తులందరూ పరమభక్తిశ్రద్ధలతో చేసేదే ఈ గిరిప్రదక్షిణ. గిరిప్రదక్షిణం అనగానే మనకు గుర్తుకువచ్చేది అరుణాచలం గిరిప్రదక్షిణ, మన తెలుగురాష్ట్రంలోని సింహాచల, శ్రీకాళహస్తి, ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణలు. గతంలో లేనిది, సరికొత్త విధిని జోడిస్తూ యాదాద్రి లక్ష్మీనారసింహుని గిరికి కూడా అటువంటి గిరిప్రదక్షిణా విధిని ఏర్పాటుచేయటం ఈ ఆలయానికి చేరిన మరో వైభవం.

yadadri laxmi narasimha swamy
యాదాద్రి
author img

By

Published : May 23, 2021, 5:40 PM IST

యాదాద్రిలో గిరిప్రదక్షిణలు

పూజావిధి నిర్వహించేవారు చివరలో ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అని తమ చుట్టూ తాము ప్రదక్షిణలు చేస్తారు. గుడికి వెళ్లిన వారు ముందుగా మూడు ప్రదక్షిణలు గుడిచుట్టూ ప్రదక్షిణ చేసి ఆలయంలోపలికి వెళతారు. తాము దర్శించే దేవస్థానం ఉన్న క్షేత్రానికంతటికీ ప్రదక్షిణ చేయటం ఓ విశిష్టమైన సంప్రదాయంగా పండితులు చెబుతారు. అంతటి విశిష్టతను, ఇంతకుముందు లేని ఈ గిరిప్రదక్షిణావిధిని నూతన యాదాద్రి బృహద్‌నిర్మాణానికి కూడా కల్పించారు. పంచనారసింహ స్వరూపాల్లో ఐదో స్వరూపంగా ఏ కొండనైతే సంభావిస్తున్నారో ఆ యాదగిరి గుట్ట చుట్టూ ప్రదక్షిణా పథాన్ని వినూత్నంగా ఏర్పాటవుతోంది.

గిరిని చుట్టుట శుభమట

గిరి ప్రదక్షిణ అనగానే మనకు గుర్తుకువచ్చేది 14కిలోమీటర్ల అరుణాచల గిరిప్రదక్షిణే గుర్తుకు వస్తుంది. తండ్రి శివుడు పెట్టిన పోటీలో గణేశుడు గెలిచి ఫలాన్ని పొందినది ఇక్కడేనని పురాణగాధ. గిరిని చుట్టుట శుభమని ఆధ్యాత్మికవేత్తలంటారు. వారి వివరణలో ప్రదక్షిణ అనే పదంలో ‘ప్ర' అంటే సకల పాపాల నిర్మూలన; ‘ద’ అంటే సకలైశ్వర్య ప్రదానం. ‘క్షి’ అంటే పునర్జన్మల నాశనం; ‘ణ’ అంటే జ్ఞానమోక్ష ప్రసాదం.” మన తెలుగురాష్ట్రాలలోని సింహాచల క్షేత్రంలో ఆషాఢ పౌర్ణమినాడు 32కిలోమీటర్ల గిరిప్రదక్షిణ కూడా ఎంతో విశిష్టమైందిగా చెబుతారు. ఇంకా శ్రీకాళహస్తిలో కైలసగిరిప్రదక్షిణ, విజయవాడ ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ, అటువంటి విశిష్టమైన గిరిప్రదక్షిణను యాదాద్రికి కూడా కల్పించారు. యాదాద్రి నూతన నిర్మాణ వైభవంలో భాగంగా ఈ గిరిప్రదక్షిణా పథం బహుచక్కగా ఏర్పాటు చేశారు. అందుకు ఆవసరమైన ప్రాకృతిక, భౌగోళిక ఆవరణం ఈ గుట్టకు ఉండటం ఓ విశేషమైతే, గిరిప్రదక్షిణను ఊహించి, నిర్మించి సిద్ధం చేయటం పరమవిశేషం.

నక్షత్రవనం

యాదాద్రి క్షేత్రంలోకి ప్రవేశించినంతనే ఎదురుగా కానవచ్చేది తుదిమెరుగులు అద్దుకుంటూ సిద్ధమవుతున్న వైకుంఠద్వారం. అక్కడ నుంచే యాదాద్రి గిరిప్రదక్షిణా పథం కూడా ప్రారంభమయ్యేది. అలా కొంచెం ముందుకు సాగితే యాదమహర్షి తన తపోబలంతో శాంతస్వరూప నరసింహస్వామి వెలిసేలా చేసిన యాదమహర్షి తపోవృక్షస్థలి కానవస్తుంది. గిరిప్రదక్షిణా మార్గాన్ని దాటుకుంటూ యాదాద్రి కొండపైకి వెళ్లే వాహన రహదారి కూడా అక్కడ నుంచే ప్రారంభమవుతుంది. గిరిప్రదక్షిణా మార్గంలో జాతకపరంగా ఏఏ రాశుల, నక్షత్రాల వారు ఏఏ వృక్షాలను పూజించాలో ఆ నక్షత్రవనం పాదుకొల్పుతున్న దృశ్యాలు మనలను ఆకర్షిస్తుంది. అదే ప్రదేశంలో మెట్లమార్గం కూడా కాలినడక భక్తుల కోసం నిర్మితమవుతోంది. ప్రదక్షిణా పథంలో మనకు కనిపించే విశేషాలలో గండిచెరువులో స్వామి వారి తెప్పోత్సవ సంరంభానికి సిద్ధమవుతున్న లక్ష్మీపుష్కరిణి, కళ్యాణకట్ట, దీక్షాధారుల కాంప్లెక్స్‌, భక్తజన పుష్కరిణిలు దర్శనీయమవుతాయి.

యథతథంగా నిర్మాణాలు

గిరిప్రదక్షిణలో మరో ఆధ్యాత్మిక, మనోరంజకమైనదేవిటంటే... గిరిప్రదక్షిణా మార్గంలో ఏ దిశనుంచి, ఏ కోణంలోంచి చూసినా యాదాద్రి నారసింహుని నూతన ఆలయశోభ వినూత్నంగా కనిపించేలా చేసిన విధం విశేషమైనది. అలా విశేషాలమయంగా యాదాద్రిని గిరిప్రదక్షిణలను చక‌్కగా ప్రణాళికలు వేసుకుని, కాగితాలపై నమూనాలను చిత్రించుకుని వాటికి యథతథంగా నిర్మాణాలు కావించారు. స్థపతుల, ఆర్కిటెక్ట్‌ల పని కాగితాలపై నక్షాల వరకే అయితే దానిని సాకారం చేస్తున్న శ్రమజీవన నరనారాయుణులదే. వారి నిర్మాణకౌశలంతో రూపుదిద్దుకున్న యావత్తు యాదాద్రి ముఖచిత్రాన్ని సకల దిశల్లోంచి సర్వరూపాలుగా చూడగలిగేలా చేసేది ఈ గిరిప్రదక్షిణ.

ఇదీ చదవండి: యాదాద్రి వెండిశిల్పఫలకాలపై ప్రహ్లాదచరితం

శైవవైష్ణవ సంగమ యాదాద్రి.. నూతనత్వంతో వినూత్న సొబగులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.