లోక కల్యాణార్థం ప్రతి ఏటా జరిగే యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను ఈ సారి మార్చి 15 నుంచి 25 వరకు శాస్త్రోక్తంగా నిర్వహించాలని దేవస్థానం కమిటీ నిర్ణయించింది. కొవిడ్ వ్యాప్తి, ప్రధాన ఆలయ పునర్నిర్మాణం పూర్తి కానందున ఈ ఏడాది కూడా బాలాలయంలోనే బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని ఆలయ సభ్యుల అంతర్గత సమావేశంలో ఈఓ గీతారెడ్డి, వంశపారంపర్య ధర్మకర్త నరసింహమూర్తి ప్రధాన అర్చకులు నిర్ణయించారు.
ఫిబ్రవరి 18 నుంచి 21వ తేది వరకు అధ్యయనోత్సవాలు, 22 నుంచి 28 వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. యాదాద్రీశుడి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణను కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏ విధంగా చేపట్టాలి అనే ప్రణాళిక నివేదికను అధికారులు దేవాదాయశాఖ కమిషనర్‌కు పంపినట్లు సమాచారం. యాదాద్రి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ పూర్వగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల నిర్వహణపై కూడా అధికారులు ఈ సమావేశంలో చర్చ జరిపారు.
ఇదీ చదవండి: శిల్పారామంలో మొదలైన సంక్రాంతి వేడుకలు