ETV Bharat / state

రాష్ట్రంలో నియంత పాలన: కోమటిరెడ్డి - compaign

యాదాద్రి జిల్లాలోని తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి ప్రచారం చేశారు. కాంగ్రెస్​ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

ప్రాదేశిక ప్రచారంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి
author img

By

Published : May 7, 2019, 10:31 PM IST

ప్రాదేశిక ప్రచారంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి

యాదాద్రి జిల్లాలో రెండో విడత ప్రాదేశిక ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. రేపటితో రెండో విడత ఎన్నికల ప్రచారం ముగుస్తుండటం వల్ల కాంగ్రెస్ ప్రచారాన్ని వేగవంతం చేసింది. జిల్లాలోని తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో నియంత పాలన నడుస్తోందని, ధనిక రాష్ట్రమైన తెలంగాణను తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు జలగల్లా పీక్కుతిని అప్పులపాలు చేశారని విమర్శించారు.

ఇవీ చూడండి: ఉత్తమ్​ కుమార్​రెడ్డి అప్పుల్లో ఉన్నాడు: జగ్గారెడ్డి

Tg_nlg_07_yadadri_komati_reddy_ennikala____pracharam_av_c21 తేదీ:7:5:19 సెంటర్: యాదగిరిగుట్ట జిల్లా: యాదాద్రిభువనగిరి రిపోర్టర్ ...చంద్రశేఖర్...ఆలేరు సెగ్మెంట్ వాయిస్: యాదాద్రి జిల్లాలో రెండో విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. రేపటితో రెండో విడత ఎన్నికల ప్రచారం ముగుస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారం స్పీడప్ చేసింది. అందులో భాగంగా తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు. మొదట తుర్కపల్లి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం చేసిన రాజగోపాల్ రెడ్డి, అనంతరం యాదగిరిగుట్ట మండలం మల్లాపూర్, పెద్దకందుకూరు, సైదాపురం, మాసాయిపేటలో సుడిగాలి పర్యటన చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన రాజగోపాల్ రెడ్డికి ప్రజలు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. మంగళహారతులతో మహిళలు నీరాజనాలు పలికారు. రాష్ట్రంలో నియంత పాలన నడుస్తోందని, ధనిక రాష్ట్రమైన తెలంగాణను తండ్రీ, కొడుకు, కూతురు, అల్లుడు జలగల్లా పీక్కుతిని అప్పులపాలు చేశారని విమర్శించారు. ఎవరూ అధైర్యపడొద్దన్న రాజగోపాల్ రెడ్డి, రానున్నది కాంగ్రెస్ రాజ్యమేనని, కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. బైట్: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.