గత మూడ్రోజులుగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో జరుగుతున్న జయంతి ఉత్సవాలు నేటితో ముగిశాయి. ఉదయం మహా పూర్ణాహుతిని ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు పూర్తి చేశారు. అనంతరం సహస్ర కలశాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు.
వెయ్యి కలశాలను వరుస క్రమంలో పేర్చి.. మంత్రజలంతో ప్రత్యేక పూజలు చేశారు. వేదపారాయణాలు, రుత్వికుల మంత్రోచ్ఛరణల మధ్య సహస్ర కలశాభిషేక ఘట్టాన్ని కన్నుల పండువగా చేశారు.
సహస్ర కలశాభిషేకంతో ఉత్సవాలకు వైభవంగా పరిసమాప్తి పలికారు. రేపటి నుంచి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలను తిరిగి పునరుద్ధరించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇవీ చూడండి: అధికారులకు స్మితా సబర్వాల్ వార్నింగ్