యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహా స్వామివారికి సంబంధించిన అధికారిక బ్యాంకు క్యూఆర్ కోడ్‌ను ఆలయ ఈఓ గీత విడుదల చేశారు. స్వామి ప్రధానాలయంలోని విమాన గోపురం బంగారు తాపడానికి ప్రజలు, స్వామి వారి భక్తులు తమ మొబైల్ ద్వారా క్యూర్ కోడ్‌ను స్కాన్ చేసి, విరాళం అందించొచ్చని ఈవో తెలిపారు. తమకు తోచిన సాయం చేసి బంగారు తాపడం నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. దాతలు బ్యాంక్‌కు నేరుగా రాకుండా ఎక్కడి వాళ్లు అక్కడే విరాళం అందజేసేందుకు బ్యాంక్ క్యూ ఆర్ కోడ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు.
వెల్లువెత్తుతున్న విరాళాలు..
తెలంగాణలో ప్రతిష్ఠాత్మకమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నారసింహుడి.. ఆలయ పునర్నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ (Cm Kcr) పిలుపు మేరకు.. ఆలయ విమాన గోపురానికి బంగారుతాపడం కోసం ఇప్పటికే విరాళాలు (Gold Donation For Yadadri) వెల్లువెత్తాయి. యాదాద్రి ఆలయ విమాన గోపురానికి తమ కుటుంబం తరఫున కిలో 16 తులాల బంగారం విరాళమిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ (Kcr Gold Donation For Yadadri) ప్రకటించారు. ఆలయ విమాన గోపురానికి భారీగా బంగారం అవసరమని సీఎం తెలిపారు. విమాన గోపురానికి 125 కిలోల బంగారం అవసరం పడుతుందని ముఖ్యమంత్రి వివరించారు. విమాన గోపురానికి దాతలు బంగారం విరాళం ఇస్తామని చెప్పినట్లు సీఎం పేర్కొన్నారు.
వ్యాపారవేత్తల విరాళాలు..
బంగారు తాపడం కోసం 6 కిలోల బంగారాన్ని అందించనున్నట్లు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌స్ట్రాక్చర్స్ లిమిటెడ్- (MEIL) డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్రకుమార్ కామరాజు యాదాద్రి విమాన గోపురం కోసం రెండు కిలోల బంగారం విరాళం ప్రకటించారు. ప్రముఖ వ్యాపారవేత్త ఎన్వీ రామరాజు.. జలవిహార్ తరపున కిలో బంగారాన్ని అందిస్తామని ప్రకటించారు.
ప్రజాప్రతినిధుల విరాళాలు..
సీఎం కేసీఆర్ స్ఫూర్తితో యాదాద్రి ఆలయానికి ప్రజాప్రతినిధులు భూరి విరాళాలు ప్రకటించారు. మేడ్చల్, రంగారెడ్డి తెరాస ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విరాళం ఇవ్వడానికి ముందుకొచ్చారు. యాదాద్రి ఆలయానికి ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు నవీన్, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు గాంధీ, హన్మంతరావు కృష్ణారావు, వివేక్ ఆనంద్ కిలో చొప్పున బంగారం విరాళం ప్రకటించారు. సిద్దిపేట నియోజకవర్గ ప్రజల తరఫున మంత్రి హరీశ్‌రావు కిలో బంగారం విరాళం ప్రకటించారు. హెటిరో ఛైర్మన్ పార్థసారథి.. యాదాద్రికి 5 కిలోల బంగారం విరాళం ప్రకటించారు.
ఇదీ చూడండి: