ETV Bharat / state

హరితహారానికి యాదాద్రి జిల్లా ఓ మోడల్: సునీత మహేందర్ రెడ్డి - ఆరో విడత హరితహారం వివరాలు

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరో విడత హరితహారం కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభించారు. జిల్లాలోని బిల్యా నాయక్ తండాలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా, జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్​లు మొక్కలు నాటారు.

Yadadri district should remain a model for greenery programme Haritahaaram
'యాదాద్రి జిల్లా హరితహారానికి మోడల్​గా కొనసాగాలి'
author img

By

Published : Jun 25, 2020, 5:14 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరో విడత హరితహారం కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. జిల్లాలోని బిల్యా నాయక్ తండాలో హరితహారంలో భాగంగా ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, కలెక్టర్ అనితా రామచంద్రన్​ మొక్కలు నాటారు. పెద్ద సంఖ్యలో ఉపాధి హామీ కూలీలతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.

హరితహారం కార్యక్రమానికి యాదాద్రి జిల్లా మోడల్​గా మారిందని... ఈ విషయాన్ని సీఎం కేసీఆర్​ సైతం గుర్తించారని సునీత అన్నారు. ఈ ఆదర్శాన్ని ఇలాగే కొనసాగించాలని.... దీనికి జిల్లాలోని అధికారులు, ప్రజా ప్రతినిధుల నిరంతర శ్రమే కారణమని కొనియాడారు. ఆరో విడత హరితహారాన్ని అన్ని గ్రామాల్లోనూ ఒక పండుగలా ప్రారంభించుకున్నామని... ఈ ఏడాదికి గానూ 46 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని కలెక్టర్​​ తెలిపారు.

ఇదీ చూడండి : '30 కోట్ల మొక్కలు నాటడమే ఆరో విడత హరితహారం లక్ష్యం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.