యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో పోలీస్ చెక్‌పోస్టును డీసీపీ నారాయణరెడ్డి సందర్శించారు. లాక్‌డౌక్ సమయంలో పోలీసుల పనితీరు, ప్రజల సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.
లాక్డౌన్ అమలులో గడిచిన 14 రోజుల్లో ప్రజల్లో అవగాహన పెరిగిందని డీసీపీ అన్నారు. ప్రస్తుతం అనవసరంగా రోడ్లపై తిరిగే వారి సంఖ్య తగ్గిందని ఆయన వెల్లడించారు. జిల్లాలో మొదట్లో రోజుకు 800 మంది కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించే వారని.. ప్రస్తుతం ఆ సంఖ్య 150కు తగ్గిందని పేర్కొన్నారు. ప్రజల సహకారం ఉంటే కరోనాను జయించవచ్చని డీసీపీ అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ ఉదయ్ కిరణ్, ఏఎస్ఐ ప్రకాశ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కరోనా ఫ్రీ విలేజ్.. నేటికీ ఆ గ్రామానికి దరిచేరని వైరస్