ETV Bharat / state

పారిశుద్ధ్య లోపం.. పొంచి ఉంది అనారోగ్యం - యాదగిరి గుట్టలో దుర్గంధం వెదజల్లుతోన్న కాలనీలు

పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో పారిశుద్ధ్యం అస్థవ్యస్తంగా మారింది. పాలకుల ఉదాసీనత, అధికారుల నిర్లక్ష్యం.. స్థానికులకు శాపంగా మారింది. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక పోవడం వల్ల.. దుర్గంధం వెదజల్లుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురపాలక కార్యాలయంలో ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు.

Yadadri Bhuvanagiri district Yadagirigutta lack sanitation.
పారిశుద్ధ్య లోపం.. పొంచి ఉంది అనారోగ్యం
author img

By

Published : May 27, 2020, 2:42 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో పారిశుద్ధ్యం లోపించింది. పట్టణంలోని 12వ వార్డు ఇంటి పరిసరాలలో మురుగునీరు పారుదల వ్యవస్థ సరిగ్గా లేక ఇళ్ల ముందుకు వస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు.

చొరవ తీసుకుని.. చర్యలు చేపట్టాలి..

డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక పోవడం వల్ల.. దుర్గంధం వెదజల్లుతోందని మండిపడుతున్నారు. పురపాలక కార్యాలయంలో ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని.. పారిశుద్ధ్య సిబ్బంది పనులు సక్రమంగా చేయటం లేదని ఆరోపిస్తున్నారు. అధికారులు చొరవ తీసుకుని చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి: రైతులను నిండాముంచిన అకాల వర్షం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.