తెలంగాణ సర్కార్ ఆదేశాల మేరకు వ్యవసాయేతర ఆస్తుల నమోదు సర్వే కట్టుదిట్టంగా చేపట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ అధికారులను ఆదేశించారు. సర్వేలో ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా కచ్చితత్వంలో ఉండాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను వివరిస్తూ.. సర్వే పూర్తి వివరాలను యాప్లో నమోదు చేయాలని తెలిపారు.
గ్రామాల్లో ఇంటింటి సర్వే చేపట్టి ఒకరోజు ముందుగానే ప్రజలకు సమాచారం అందించాలని చెప్పారు. సర్వేల్ అంగన్వాడీ కార్యకర్తలను, వీఆర్ఏలను, స్థానిక సిబ్బందిని సమన్వయం చేస్తూ నిర్దేశించిన కాలవ్యవధిలో పూర్తి చేయాలన్నారు. మోటకొండూరు మండలం చందేపల్లి గ్రామంలో పర్యటించిన కలెక్టర్.. రైతు వేదిక భవన నిర్మాణాలను పరిశీలించారు. నాణ్యతతో కూడిన భవనాలను దసరాలోగా పూర్తి చేయాలని సిబ్బంది, అధికారులను ఆదేశించారు.
- ఇదీ చూడండి: విద్యాసంస్థలు ఇప్పుడే తెరవలేం.. దసరా తర్వాతే నిర్ణయం