రైతు వేదిక నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని యాదాద్రి భువనగిరి కలెక్టర్ అనితా రామచంద్రన్ అధికారులను ఆదేశించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని వేల్లజాల, సీతారాంపురం గ్రామాల్లో రైతు వేదిక నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో రైతు వేదికలను నాణ్యతతో... త్వరగా పూర్తి చేయాలని గుత్తేదారులకు సూచించారు.
గుత్తేదారులు ఇసుక కొరతను ఎదుర్కొంటున్నట్లు కలెక్టర్‌కు తెలిపారు. రైతు వేదికలకు అవసరమైన ఇసుకను స్థానిక వనరుల నుంచి సమకూర్చాలని తహసీల్దార్ దయాకర్ రెడ్డికి చెప్పారు. కలెక్టర్‌తో పాటు ఎంపీపీ తాండ్ర అమరావతి, తహసీల్దార్ దయాకర్ రెడ్డి, ఆలేరు డివిజనల్ వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు, ఎంపీడీవో స్వాతి, పీఆర్డీఈ నరేందర్, సర్పంచులు మాలిపెద్ది మాధవి, సంగీత, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: వైద్య ఆరోగ్య శాఖలో త్వరలోనే 12 వేల పోస్టుల భర్తీ