యాదాద్రి పుణ్యక్షేత్రంలో జరుగుతున్న ఆలయ విస్తరణతో కూడిన పునర్నిర్మాణం పనులు దాదాపు పూర్తి అయ్యాయని 'యాడా' వైస్ ఛైర్మన్ కిషన్ రావు చెప్పారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆయన సోమవారం దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పనులను పరిశీలించారు.
ప్రధాన ఆలయ సాలహారాలలో విగ్రహాల పొందిక పనులు త్వరలోనే మొదలవుతాయన్నారు. మిగిలిన పనులన్నీ వీలైనంత త్వరలో పూర్తి అవుతాయన్నారు. ప్రధానాలయంలో జరుగుతున్న క్యూలైన్ పనులను, విష్ణు పుష్కరిణి, రిటైనింగ్ వాల్, రథశాల, కొండపై నిర్మాణం చేపడుతున్న పనులన్నింటిని వీక్షించారు. శివాలయంలో తుదిదశకు చేరుకుంటున్న పనులు, ఘాట్ రోడ్లో చేపడుతున్న గ్రీనరీ మొదలగు వాటిని పరిశీలించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చూడండి: వేతన సవరణపై త్వరలోనే కేసీఆర్ నిర్ణయం!