త్రిదండి చినజీయర్ స్వామిని యాదాద్రి దేవాలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ వైస్ ఛైర్మన్ కిషన్‌రావు, శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి గీతారెడ్డి, వంశపారంపర్య ధర్మకర్త నరసింహమూర్తి బుధవారం పరామర్శించారు. స్వామిజీ మాతృమూర్తి పరమపదించడంతో శంషాబాద్‌లోని ఆయన కుటీరంలో కలిసి విచారం వ్యక్తపరిచారు. వీరి వెంట ఆలయానికి చెందిన వేదపండితులు ఉన్నారు.
శాస్త్రోక్తంగా నిత్యారాధనలు: యాదాద్రి పుణ్యక్షేత్రంలో బుధవారం నిత్యారాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. బాలాలయంలో వైష్ణవ ఆచారంగా పంచ నారసింహులను ఆరాధిస్తూ హారతి నివేదనతో కైంకర్యాలకు శ్రీకారం చుట్టారు.