ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా గతంలో నిర్మించిన కొన్ని కట్టడాలను తొలగిస్తున్నారు. కొండపైన రాయగిరి చెంత ఉన్న స్వాగత తోరణాలు తొలగించి సరికొత్త డిజైన్లో భక్తులను ఆకట్టుకునేలా నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు.
యాదాద్రీశుని రథాన్ని భద్రపరిచేందుకు.. ప్రధాన ఆలయ సన్నిధికి తరలించారు. క్షేత్ర అభివృద్ధి పనులు చేపట్టినందున స్వామి రథంతో పాటు శివాలయ రథాన్ని చెరమూర్తుల మందిరం చెంతనున్న షెడ్డులో భద్రపరిచారు.
ప్రపంచం ఆశ్చర్యపడేలా, దేశ నలుమూలలా తెలంగాణ కీర్తిని చాటేలా.. యాదాద్రి ఆలయ నిర్మాణం జరుగుతోందని యాడా అధికారులు చెబుతున్నారు. నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయని తెలిపారు.