యాదాద్రి పుణ్యక్షేత్రంలో యాడా అతిథి గృహాన్ని ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. పెద్దగుట్టపై రూ.3.5 కోట్ల వ్యయంతో ఈ నిర్మాణం చేపట్టారు. 549 చ.మీ. స్థలంలో కుటీరంలా అతిథిగృహ సముదాయం ఏర్పాటు చేస్తున్నారు.
ఈ అతిథి గృహంలో నాలుగు పడక గదులు, హాల్, ఆఫీసుతో పాటు ఇతర మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు సంబంధిత ఆర్అండ్బీ శాఖ డీఈ మణి బాబు తెలిపారు. ఆ అతిథిగృహం ప్రాంగణం నుంచి యాదాద్రి క్షేత్ర పరిసరాలను చూడొచ్చు.
ఇదీ చదవండి: Guidelines: ప్రభుత్వ భూముల అమ్మకానికి మార్గదర్శకాలు ఖరారు