యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని గోకారంలో ఈరోజు ఉదయం తాటి చెట్టుపై నుంచి పడి కల్లు గీత కార్మికుడు మృతి చెందాడు. మృతుడు కంచర్ల ముత్తులుగా గుర్తించారు. ఈరోజు ఉదయం రోజూ మాదిరిగానే కల్లు గీయటానికి వెళ్లి పట్టు జారీ కిందపడ్డట్లు స్థానికులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
గీత కార్మికుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ పెద్దను కోల్పోవడం వల్ల ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇవీ చూడండి: కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందని.. మంత్రి గన్మెన్ వీరంగం