యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయ అభివృద్ధి పనులు అధికారుల పర్యవేక్షణలో వేగంగా కొనసాగుతున్నాయి. గతనెల 17వ తేదీన యాదాద్రి దర్శనానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆలయ ఈవో అనుమతి తీసుకోకుండా పునర్నిర్మాణ పనులను, ప్రధానాలయాన్ని వీడియో తీసి తమ వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్లో పొందుపరిచారు. ఈవో ఫిర్యాదు మేరకు పోలీసులు వీడియో చిత్రీకరించిన రాకేశ్, నవీన్‌లను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరిలించారు. వీరు హైదరాబాద్‌లోని అంబర్ పేటకు చెందిన వారిగా గుర్తించారు.
ఇవీ చూడండి: 'జలియన్ వాలాబాగ్' మారణకాండకు వందేళ్లు