యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఆదివారం సాయంత్రం ఒక గంట పాటు వర్షం కురిసింది. ఎండలతో మండిపోయిన వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వేసవి తాపంతో అల్లాడిపోయిన స్థానికులు చల్లటి వాతావరణంతో ఉపశమనం పొందారు. ఈదురు గాలులకు యాదగిరిపల్లిలోని ఓ బావి దగ్గర తాటి చెట్టు విరిగిపడింది.
లాక్డౌన్ సందర్భంగా రహదారులపై ఏర్పాటు చేసిన బారికేడ్లు గాలికి కొట్టుకుపోయాయి. గాలి బీభత్సానికి కాసేపు విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడవకుండా ఉండేందుకు రైతులు నానా అవస్థలు పడ్డారు. మోటకొండూర్ మండల కేంద్రంలోనూ చిరు జల్లులు కురిశాయి.
ఇదీ చదవండి: వ్యాక్సిన్ వద్దని నదిలో దూకి పరార్!