ETV Bharat / state

మూసీ ప్రవాహం పెరిగింది... రోడ్డుపైకి నీరు చేరింది..

రెండ్రోజులుగా కురుస్తున్న వానలకు యాదాద్రి భువనగిరి జిల్లా పెద్దరావులపల్లి వద్ద మూసీ ప్రవాహం పెరిగింది. వరద నీటితో లోలెవెల్​ వంతెన మునిగి పోవడం వల్ల మూసీకి ఇరుపక్కల ఉన్న గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.

మూసీ ప్రవాహం పెరిగింది... రోడ్డుపైకి నీరు చేరింది.
author img

By

Published : Aug 3, 2019, 5:00 PM IST

మూసీ ప్రవాహం పెరిగింది... రోడ్డుపైకి నీరు చేరింది.

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం భట్టుగూడెం - పెద్దరావులపల్లి గ్రామాల మధ్య ఉన్న మూసీ నది ప్రవాహం పెరిగింది. నీటి ప్రవాహంతో లో-లెవెల్ బ్రిడ్జి మునిగి పోవడం వల్ల నదికి ఇరుపక్కల ఉన్న గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరో మార్గంలో వెళ్లాలంటే 20 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తుండడం వల్ల ప్రవాహం ఎక్కువగా ఉన్నా లో-లెవెల్ బ్రిడ్జ్ మీదుగానే ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. అసంపూర్తిగా ఉన్న హై-లెవెల్​ వంతెన త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Intro:TG_NLG_61_03_MUSIPRAVAHAM_AB_TS10061

యాంకర్ : గత రెండు రోజులు గా హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు మూసి నది ఉదృతంగా ప్రవహిస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం భట్టు గూడెం - పొచంపల్లి మండలం పెద్ద రావుల పల్లి గ్రామాల మధ్య ఉన్న మూసీ నది ప్రవాహం పెరిగి లో లెవెల్ బ్రిడ్జి మునిగి పోయింది. దీనితో మూసీ నదికి ఇరుపక్కల ఉన్న గ్రామాల ప్రజల రాక పోకలు స్తంభించాయి. భువనగిరి నుంచి పోచంపల్లి వెళ్లాలంటే దగ్గరి దారి గా ఈ మూసీనదిని దాటాల్సి ఉంటుంది. ఇక్కడ హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోవడంతో లో లెవెల్ బ్రిడ్జి పై నుంచి పరిసర గ్రామ ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. మూసీ నది ప్రవాహం పెరిగినప్పుడు, లో లెవల్ బ్రిడ్జి పూర్తిగా మునిగిపోయి రాకపోకలు పూర్తిగా స్తంభిస్తున్నాయి. మరో మార్గంలో వెళ్లాలంటే 20 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తుండడంతో ప్రవాహం ఎక్కువగా ఉన్నా అందరూ ఈ లోలెవెల్ బ్రిడ్జ్ మీదుగానే ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. లో లెవెల్ బ్రిడ్జ్ పక్కనే హై లెవెల్ బ్రిడ్జ్ దాదాపు నిర్మాణం చివరి దశకు వచ్చింది. కేవలం 10 శాతం పనులు మాత్రమే మిగిలి ఉంది. బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా భూమి నష్టపోతున్న రైతులకు ఇచ్చే నష్టపరిహారం త్వరగా ఇస్తే ఈ పాటికిబ్రిడ్జి నిర్మాణం ఎప్పుడో పూర్తి అయ్యేది. ఇప్పటికైనా అసంపూర్తిగా ఉన్న హై లెవెల్ బ్రిడ్జ్ త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Body:ఇప్పటికైనా అసంపూర్తిగా ఉన్న హై లెవెల్ బ్రిడ్జ్ త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

బైట్ : ఆంజనేయులు (ఇంద్రియాల, పోచంపల్లి మండలం )

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.