ETV Bharat / state

వాగులో కొట్టుకుపోయాడు.. చెట్టు సాయంతో బయటకొచ్చాడు

చాలా రోజుల తర్వాత వాగు పొంగడం వల్ల ఆ దృశ్యాలను చూసేందుకని వచ్చాడో యువకుడు. ప్రమాదవశాత్తు ఆ వాగులో పడి కొట్టుకుపోయాడు. స్థానికుల సాయంతో 15 నిమిషాల్లోనే బయటపడి ప్రాణాలు దక్కించుకున్నాడు.

వాగులో కొట్టుకుపోయాడు.. చెట్టు సాయంతో బయటకొచ్చాడు
author img

By

Published : Oct 13, 2019, 1:29 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో ఎగువన కురిసిన వర్షానికి బిక్కేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. ఆదివారం ఉదయం ఉదయం 5 గంటల సమయంలో ఆత్మకూరు మండలంలోని కొరటికల్ గ్రామానికి చేరుకుంది. ఈ ప్రాంతంలోని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం వర్షాలు సకాలంలో లేకపోయనా బిక్కేరు వాగు రావడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయని చెబుతున్నారు. వాగు చాలా రోజుల తరువాత ప్రవహించడం వల్ల స్థానికులు అధిక సంఖ్యలో వచ్చి ప్రవాహ ఉద్ధృతిని చూస్తున్నారు. కొరటికల్ గ్రామానికి చెందిన ఓ యువకుడు వాగును చూస్తున్న సమయంలో ప్రవాహం పెరిగి కల్వర్టు పైనుంచి ఓ యువకుడు వాగులో పడిపోయాడు. సుమారు 100 మీటర్ల దూరం కొట్టుకుపోయాడు. అదృష్టవశాత్తు ఓ చెట్టు ఆసరా దొరికింది. అక్కడే ఆగిపోయాడు. విషయం గమనించిన స్థానికులు 15 నిమిషాల వ్యవధిలోనే తాళ్ళ సహాయంతో యువకుడిని రక్షించారు.

వాగులో కొట్టుకుపోయాడు.. చెట్టు సాయంతో బయటకొచ్చాడు

ఇవీ చూడండి: ఆ గ్రామాల్లో యువకులందరూ పెళ్లికాని ప్రసాదులే..!

Intro:Contributor Anil
Center Tungaturthi
Dist Suryapet.
యాదాద్రి భువనగిరి జిల్లా లో ఎగువ న కురిసిన వర్షానికి జిల్లా లోని ఆలేరు నియోజకవర్గంలో ప్రవహిస్తున్న బిక్కేరు వాగు ఈ రోజు ఉదయం ఉదయం 5 గంటల సమయంలో ఆత్మకూరు మండలం కొరటికల్ గ్రామానికి చేరుకుంది .
ఈ ప్రాంతంలోని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం వర్షాలు సకాలంలో లేకపోయనా బిక్కేరు వగు ప్రవహించడంతో భూగర్భజలాలు పెరుగుతాయని ఆనందం వ్యక్తంచేస్తున్నారు. వాగు చాల రోజుల తరువాత ప్రవహించడంతో స్థానికులు అధిక సంఖ్యలో వచ్చి చూస్తున్నారు, కొరటికల్ గ్రామ యువకుడు వాగును చూస్తున్న సమయంలో వాగు ఉదృతంగా రావడంతో కల్వర్టు పైనుంచి వాగులో పడి సుమారు 100మీటర్ల దూరం కొట్టుకపోయి వాగులోని చెట్టును ఆసరా తీసుకున్నాడు. ఇది గమనించిన రైతులు 15 నిమిషాల వ్యవధిలోనే అక్కడే కట్టెలు తీసుకెళుతున్న ట్రాక్టర్ లోని తాళ్ళసహాయం తో ఆయువకున్ని రక్షించారు.Body:.Conclusion:.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.