యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని యాడా కమిటీ మెంబర్, టీఎస్‌ఈడబ్లూఐడీసీ అధికారి నాగేందర్ రెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారిని యాడ టెక్నికల్ కమిటీ మెంబర్ బి.లక్ష్మీ నరసింహ రెడ్డి దర్శించుకున్నారు. ఆయన జన్మదినం సందర్భంగా కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. బాలాలయంలోని కవచ మూర్తులను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అధికారులు స్వామి వారిలడ్డూ ప్రసాదం అందజేశారు.
పనులపై సమీక్ష
దర్శనం అనంతరం యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రధాన ఆలయం వద్ద జరుగుతున్న ఫ్లోరింగ్ మరమ్మతులు, డ్రైనేజీ వ్యవస్థ, పుష్కరిణి శివాలయం, ప్రసాదం కాంప్లెక్స్ లో జరుగుతోన్న పనులు, ప్రధాన ఆలయం వద్ద చేపడుతోన్న పనుల వివరాలను ఆడిగితెలుసుకున్నారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు వైటీడీఏ అధికారులు ఉన్నారు.
టీఎస్‌ఈడబ్లూఐడీసీ అధికారి ప్రత్యేక పూజలు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారిని తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ వెల్పేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారి నాగేందర్ గౌడ్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారి సువర్ణ పుష్పార్చన పూజల్లో పాల్గొన్నారు. బాలాలయంలోని కవచ మూర్తులను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు నాగేందర్ గౌడ్‌ని ఆశీర్వదించి స్వామి వారి లడ్డూ ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: సర్వం… సుందరం…నిర్మాణ శోభితంగా యాదాద్రి క్షేత్రం..!!