Vidadala Rajini: ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని.. తెలంగాణ బిడ్డ. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కొండాపురం గ్రామానికి చెందిన రాగుల సత్తయ్య రెండో కూతురు రజని మంత్రి కావటంపై ఆ గ్రామంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సత్తయ్య బతుకుదెరువు నిమిత్తం 40 ఏళ్ల కిందట హైదరాబాద్‌కు వలస వెళ్లారు. సఫిల్‌గూడలో నివాసం ఉంటున్నారు. ఇతనికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు.
రెండో కూతురు రజని ఏపీకి చెందిన పారిశ్రామికవేత్తతో వివాహమైంది. ఆమె పల్నాడు జిల్లా చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఏపీ మంత్రివర్గంలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య మంత్రిగా చోటు దక్కించుకున్నారు.
ఇదీ చదవండి: