లక్ష్మీ నరసింహ స్వామి ప్రధాన ఆలయ పనును యాడ వైస్ ఛైర్మన్ కిషన్ రావు, ఆలయ ఈవో గీత రెడ్డి, సాంకేతిక కమిటీ కమిటీ సభ్యులు కొండల్ రావు , ఈఎన్సీ రవీందర్ పరిశీలించారు. ప్రధాన ఆలయానికి మరింత శోభనిచ్చే రాతి విగ్రహాలను, సింహాలు, ఐరావత ప్రతిమలను పరిశీలించారు. వీటిని ఇటీవల మహాబలిపురం నుంచి తీసుకొచ్చారు.
శంకు, చక్ర నామాలను ఆలయ ప్రహరీ గోడకు బిగించే ఏర్పాట్లను చూసి పలు సూచనలు చేశారు. ప్రధాన ఆలయంలో జరుగుతున్న, తుది దశ పనులను, ఆలయంలోకి వర్షం నీరు రాకుండా చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. దేవాలయం వెలుపల చేపడుతున్న సాయిల్ స్టెబిలైజేషన్ ద్వారా ఫ్లోరింగ్ మరమ్మతు పనులను, ఉత్తరదిశలో చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ పనులు, శివాలయం కొండపైననిర్మితమవుతున్న పుష్కరిణి, ఆలయ అష్ట భుజి మండపం ప్రాకారాలపై కట్టుబడి సున్నంతో చేపడుతున్న పనులను పరిశీలించారు.
ఇదీ చదవండి: కేంద్రమంత్రులు తెలంగాణకు వచ్చి కథలు చెబుతున్నారు : కేసీఆర్