యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలో వాజ్పేయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవ కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఫౌండేషన్ అధ్యక్షుడు శారజి లక్ష్మయ్య, బీజేపీ మండల అధ్యక్షుడు కళ్లెం శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన ప్రారంభించారు. దీనికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి, మాజీ రాష్ట్ర కార్యదర్శి దాసరి మల్లేశం హాజరయ్యారు.
వందమంది పేదలకు ప్రధాన మంత్రి సురక్షబీమా యోజన పత్రాలు అందజేశారు. పేద ప్రజలు ఇబ్బందులకు గురైనప్పుడు వారికి ఆసరాగా ఉండేందుకు ఇలాంటి ఫౌండేషన్లు సమాజానికి ఎంతో ఉపయోగపడుతాయని శోభారాణి తెలిపారు. నరేంద్రమోదీ అనేక సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రవేశపెట్టారని దీనిని తెలంగాణా ప్రజలు ఉపయోగించుకోవాలని తెలిపారు.