ETV Bharat / state

టీకా డోసులు లేక వెలవెలబోతున్న వ్యాక్సిన్ కేంద్రాలు - కరోనా వ్యాక్సినేషన్ సెంటర్స్

యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. మంగళవారం కేవలం 160 మందికి మాత్రమే టీకా వేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సాంబశివరావు వెల్లడించారు. మంగళవారం టీకా కేంద్రాలకు వచ్చిన వారు.. టీకా డోసులు నిల్వలేకపోవటంతో వెనుతిరిగి వెళ్లిపోయారు.

vaccine-doses-are-over-in-yadadri-bhuvanagiri-district
టీకా డోసులు లేక వెలవెలబోతున్న వ్యాక్సిన్ కేంద్రాలు
author img

By

Published : Apr 28, 2021, 10:22 AM IST

కొవిడ్​ టీకా డోసులు లేకపోవటంతో యాదాద్రి జిల్లా వ్యాప్తంగా వ్యాక్సిన్ కేంద్రాలు ఖాళీగా కనిపించాయి. జిల్లాలో టీకా నిల్వలు తగ్గిపోవడంతో వ్యాక్సినేషన్ డోసులు పంపాల్సిందిగా జిల్లా వైద్యాధికారులు నాలుగు రోజుల ముందుగానే రాష్ట్ర అధికారులను కోరారు. 20 వేల డోసులు పంపించాల్సిందిగా కోరినట్లు జిల్లా వైద్య అధికారి సాంబశివరావు తెలిపారు.

వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆగిపోకుండా 10 వేల డోసులు పంపించాలని జిల్లా నుంచి వాహనాన్ని హైదరాబాద్​కు పంపినట్లు పేర్కొన్నారు. ఈరోజు టీకా నిల్వలు వచ్చే అవకాశముందని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 1,70,690 మందికి కరోనా టీకా వేసినట్లు ఆయన పేర్కొన్నారు. 1,63,249 మంది మొదటి డోసు, 7,441 మంది రెండో డోసు తీసుకున్నట్లు తెలిపారు. మొదటి టీకా డోసు లక్ష్యానికి మించి పూర్తి అయ్యిందన్నారు. అపోహలు వీడి అందరూ టీకా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: లక్షణాల్లో తికమక.. ఆఖరి నిమిషంలో ఆగమాగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.