యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి రైల్వేస్టేషన్ సమీపంలోని అర్బన్ కాలనీ గేట్ వద్ద పట్టాలపై గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ముఖం, శరీర భాగాలు నుజ్జునుజ్జు అవటం వల్ల మృతదేహం ఎవరిదో గుర్తించటానికి వీలు లేకుండా పోయింది. మృతునికి సుమారు 35 ఏళ్లు ఉండొచ్చునని రైల్వే పోలీసులు భావిస్తున్నారు.
మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.