యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ కేంద్రంలో ఆర్టీసీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రయాణికులు, బస్సులు లేక బస్టాండ్ వెలవెలబోయింది. ఆర్టీసీ కార్మికులు, వామపక్ష పార్టీల నాయకులు ప్రైవేట్ వాహనాలను అడ్డుకున్నారు. రోడ్డుపై ధర్నాకు దిగిన వామపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ప్రభుత్వం మొండి వైఖరిని వీడి తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు కోరారు.
ఇవీ చూడండి: సాయంత్రం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం: ఆర్టీసీ ఐకాస