యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో తెరాస నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యులు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మరోసారి గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశ పెట్టారని చెప్పారు.
ఆరు సంవత్సరాల కాలంలో ఐదు లక్షల నుంచి ఆరు లక్షల ఉద్యోగులు ఇచ్చిన ఘనత కేసీఆర్కు దక్కుతుందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల డీసీసీబీ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, తెరాస నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: బిహార్ బరిలో అందరిదీ అదే వ్యూహం