యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని శాఖ గ్రంథాయంలో తిరునగరి రామానుజయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ ఛైర్మన్ కోమటి మత్స్యగిరి పాల్గొన్నారు. మోత్కూర్ శాఖ గ్రంథాలయానికి తిరునగరి 400 పుస్తకాలు అందజేశారని పేర్కొన్నారు. ఆయన మృతి తెలుగు సాహిత్యానికి తీరని లోటని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మందికి సాహిత్య రంగంలో సూచనలు అందించి కవులుగా తీర్చిదిద్దారని కొనియాడారు. త్వరలోనే మోత్కూర్ గ్రంథాలయానికి వచ్చి మరో 200 పుస్తకాలు అందజేస్తానన్నారని ఇంతలోనే అనారోగ్యంతో తిరిగిరాని లోకాలకు వెళ్లడం అత్యంత బాధాకరమని అన్నారు.
- ఇదీ చదవండి: కరోనా ఆంక్షలు బేఖాతరు- యువకులతో కప్పగంతులు